Pulses
బియ్యం, మసాలా దినుసుల నుంచి పప్పు దినుసుల వరకు.. వంటింట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలకు పురుగులు పడుతుంటాయి. కొన్ని రోజుల వరకు వీటిని చూడలేదంటే.. పురుగులు పప్పును మొత్తం తినేస్తాయి. అలాగే పనికి రాకుండా చేస్తాయి. కానీ ఒక్కసారి వీటికి పురుగుపట్టిందంటే.. వీటి సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత చేసినా ఈ పురుగును మాత్రం వదిలించలేం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పప్పు దినుసులకు పురుగులు, కీటకాలు పట్టకుండా చేయొచ్చు. ఎలాగంటే?
వేపాకులు
వేపాకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆకులు కీటకాలను తరిమి కొట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పప్పు ధాన్యాలను పురుగులు పట్టకుండా ఉండాలంటే వేపాకులను ఉపయోగించండి. ఇందుకోసం పప్పు దినుసుల డబ్బాలో ఎండిపోయిన వేపాకులను వేయండి. ఒక్క పప్పు దినుసుల్లోనే కాదు, ఎండు వేప ఆకులను కూడా అల్మారాల్లో ఉంచొచ్చు. వీటివల్ల మీ బట్టలు దెబ్బతినవు.
వెల్లుల్లి
వెల్లుల్లి కూడా పురుగులను తరిమేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పప్పు డబ్బాలో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఒక పప్పు డబ్బాలో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను వేయొచ్చు. వెల్లుల్లి రెబ్బలు పప్పులోకి పురుగు రాకుండా చేస్తుంది.
లవంగాలు
లవంగాలను చాలా ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. ఇవి ఫుడ్ రుచిని పెంచడమే కాదు.. కీటకాల నుంచి పప్పు దినుసులను కాపాడటానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా.. పప్పు డబ్బాలో 8 నుంచి 10 లవంగాలను వేయండి. అయితే ఈ డబ్బాలోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి.
ఎండ
పప్పు దినుసుల్లో పురుగును గమనించినట్టైతే ఒక పెద్ద ప్లేట్ లేదా గుడ్డను తీసుకుని ఎండలో పరిచి పప్పును పోయండి. 2 నుంచి 3 రోజులు ఈ పప్పును ఎండలోనే ఉంచండి. మీక తెలుసా? చల్లని, చీకటి ప్రదేశాల్లో కీటకాలు బాగా పెరుగుతాయి. అందుకే పప్పును ఎండలో ఉంచండి. పప్పు దినుసులకు కీటకాలు పట్టకుండా నెలకొకసారి ఎండలో పెడుతూ ఉండండి.
ఎండు మిరపకాయలు
అవును ఎండు మిరపకాయలు కూడా పప్పు దినుసులకు పురుగు పట్టుకుండా చేస్తుంది. ఇందుకోసం మీరు 2 నుంచి 3 ఎండు మిరపకాయలను తీసుకుని పప్పు డబ్బాలో వేయండి.
Fridge Clean
ఫ్రిజ్
మీ ఫ్రిజ్లో ప్లేస్ ఉంటే పప్పు ధాన్యాలను పెట్టేయండి. తక్కువ మొత్తంలో పప్పును ఫ్రిజ్ లో నిల్వ చేయొచ్చు. దీనివల్ల పప్పుకు పురుగులు అస్సలు పట్టవు. అలాగే పప్పు దినుసులు కూడా తాజాగా ఉంటాయి. కానీ గాలి వెళ్లని కంటైనర్ లోనే స్టోర్ చేయాలి.