Morning Habits పొద్దునే ఈ పాడు పనులా? అయితే మీ ఆరోగ్యం గోవిందా!

Published : Feb 21, 2025, 08:13 AM IST

చాలామంది ఉదయం లేవగానే ఫోన్ అందుకుంటారు. కొందరైతే అల్పాహారం తీసుకోవడం మానేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు. ఇవి చూడటానికి మామూలుగానే అనిపించినా ఈ అలవాట్లు కొనసాగితే దీర్ఘకాలంలో మనం జబ్బుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే పొద్దున లేవగానే మనం చేయకూడదో తెలుసుకుందాం. 

PREV
16
Morning Habits పొద్దునే ఈ పాడు పనులా? అయితే మీ ఆరోగ్యం గోవిందా!
నిద్ర లేచిన వెంటనే చేయొద్దు

మన ఉదయపు అలవాట్లే మన రోజును డిసైడ్ చేస్తాయి. వాటి కారణంగానే ఆ రోజు ఎలా గడుస్తుందో తెలుస్తుంది. నిద్రలేచిన వెంటనే కొన్ని పనులు చేయకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం మంచి అలవాట్లు ఉంటే రోజంతా హ్యాపీగా ఉంటాం.

26
ఆలస్యం వద్దు

ఉదయం లేట్‌గా నిద్ర లేస్తే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఏ పనులూ సరిగ్గా చేయలేరు. టెన్షన్ వస్తుంది, రోజంతా చిరాకుగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే నిద్రలేవండి.

36
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండండి

చాలామందికి నిద్రలేచిన వెంటనే మొబైల్ చూసే అలవాటు ఉంటుంది. ఇది తప్పు. వెంటనే ఇలా చేయడం వల్ల కళ్లు, మెదడు ఎఫెక్ట్ అవుతాయి. తలనొప్పి, కళ్ల నొప్పి, నీరసం వస్తాయి. రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు.

46
బ్రేక్‌ఫాస్ట్ మానేసే అలవాటు

కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. తేలికగా తీసుకుంటారు. దీనివల్ల శరీరానికి పోషకాలు అందవు. నీరసం వస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మానేయకండి. లేచిన గంటలోపు ఏదైనా ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు.

56
వ్యాయామం చేయాలి

ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయాలి. మరీ కఠోర కసరత్తులు కాకపోయినా.. తేలికపాటి వ్యాయామం, వేగంగా నడక.. ఇవి చేస్తుంటే ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వ్యాయామం చేయకపోతే టెన్షన్, నీరసం వస్తాయి. అందుకే తప్పకుండా చేయండి.

66
మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోండి

రోజును సంతోషంగా, ప్రొడక్టివ్‌గా మార్చుకోవడానికి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతిరోజూ ఆ రోజు ఏ విధంగా గడవాలో ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే హడావుడి లేకుండా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది, రోజంతా హ్యాపీగా ఉండొచ్చు.

click me!

Recommended Stories