Chronic Stress: మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనడానికి సంకేతాలివే!

Published : Feb 20, 2025, 05:52 PM IST

Chronic Stress: ఎవరి జీవితంలో అయినా ఒత్తిడి కామన్. కానీ ఇది నిరంతరం ఉంటే మీ శరీరం, మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిపే 10 సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని గుర్తించి వెంటనే ఉపశమనం పొందడానికి ప్రయత్నించండి.

PREV
15
Chronic Stress: మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనడానికి సంకేతాలివే!

ఎంత నిద్రపోయినా అలసిపోయినట్లు ఉండటం

నిద్రలేచిన తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే? మీరు దీర్ఘకాలిక ఒత్తిడిలో ఉన్నారన్న మాట. ఇది మీరు నిద్రపోయే విధానాన్ని కూడా మార్చేస్తుంది. దీంతో మీలో శక్తి తగ్గిపోతుంది. 

తగ్గని తలనొప్పి

తరచుగా వచ్చే తలనొప్పి లేదా మైగ్రేన్ మీకు ఒక హెచ్చరిక లాంటిది. ఒత్తిడి మీ మెడ, తలలోని కండరాలను బిగించి, నొప్పిని కలిగిస్తుంది. దీనికి మందుల కంటే స్టెస్ ని తగ్గించే మెడిటేషన్ టెక్నిక్స్ ఫాలో అవడం మంచిది.

25

ఆహారపు అలవాట్లు మారడం

ఒత్తిడి మీ ఆకలిని పెంచవచ్చు లేదా పూర్తిగా తగ్గించవచ్చు. మీ ఆహారపు అలవాట్లలో మార్పు వస్తే దానికి కారణం తీవ్రమైన ఒత్తిడి అని గుర్తించండి. 

మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం

పనులపై దృష్టి పెట్టలేకపోతున్నారా? ఒక పనిమీద గదిలోకి వెళ్లి ఎందుకు వెళ్లామో మర్చిపోతున్నారా? ఇది కూడా దీర్ఘకాలిక ఒత్తిడికి సంకేతం. ఇది మీ మెదడు పనితీరును మందగింపజేస్తుంది. మీ మనస్సు గందరగోళంగా ఉండకుండా చూసుకోండి. 

35

చిన్న విషయాలకే కోపం 

చిన్న విషయాలకే చిరాకు పడుతున్నారా? ఇది దీర్ఘకాలిక ఒత్తిడి సంకేతం. ఇది మీ భావోద్వేగాలను అదుపు తప్పేలా చేస్తుంది. కోపం ఎక్కువగా వస్తుంటే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోండి. 

కారణం లేకుండా నొప్పులు

కండరాల నొప్పి లేదా కీళ్ల నొప్పులు వస్తుంటే అది ఒత్తిడి వల్ల కావచ్చు. ఇది మీ శరీరంలో హీట్ ను పెంచుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. 

45

చర్మ సమస్యలు కూడా ఒత్తిడి వల్లే..

మొటిమలు, దద్దుర్లు లేదా తామర వంటి చర్మ సమస్యలు ఒత్తిడి వల్ల వస్తాయి. ఒత్తిడి హార్మోన్లు పెరిగినప్పుడు, మీ చర్మంపై ప్రభావం పడుతుంది. చర్మ సంరక్షణ కోసం టెక్నిక్స్ పాటించండి. 

నిస్తేజంగా అనిపించడం

దీర్ఘకాలిక ఒత్తిడి మిమ్మల్ని సామాజిక జీవితం నుండి వేరు చేస్తుంది. ఆనందం దూరమైనట్లు అనిపిస్తే, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకుని ఒత్తిడి నుంచి బయటపడటదానికి ప్రయత్నించండి. 

55

 

తరచూ అనారోగ్యం 

మీరు పదే పదే జలుబు బారిన పడుతుంటే ఒత్తిడి మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తోందని గుర్తించండి. మీ శరీరం నిరంతరం ఇన్ఫెక్షన్లతో పోరాడటం కష్టం అవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోండి.

కడుపులో ఏదోలా ఉండటం

ఒత్తిడి వల్ల కడుపు ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు వస్తాయి. మీ జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి.

 

click me!

Recommended Stories