మచ్చలు, మరకలు లేని అందానికి.. ఈ వంటింటి చిట్కాలు....

First Published Sep 18, 2021, 5:28 PM IST

పెరుగు పుల్లగా అయితే పారేయకండి. దీన్ని చక్కటి ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. దీనివల్ల మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

బామ్మలు చెప్పే చిట్కాలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి, అందానికి వంటింటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ, విరివిగా లభిస్తున్న సమాచారం వీటిని మరుగున పడేలా చేస్తున్నాయి. తేలిగ్గా తీసుకునేలా చేస్తున్నాయి. అయితే.. ఈ బ్యూటీ టిప్స్ ను మీరు ప్రయత్నిస్తే.. అందానికి మరింత వన్నెలద్దినవారవుతారు. 

బామ్మలు చెప్పే చిట్కాలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి, అందానికి వంటింటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ, విరివిగా లభిస్తున్న సమాచారం వీటిని మరుగున పడేలా చేస్తున్నాయి. తేలిగ్గా తీసుకునేలా చేస్తున్నాయి. అయితే.. ఈ బ్యూటీ టిప్స్ ను మీరు ప్రయత్నిస్తే.. అందానికి మరింత వన్నెలద్దినవారవుతారు. 

మొటిమలకు యాంటీ బాక్టీరియల్ ప్లాస్టర్ : మొటిమలు అందానికి మచ్చల్లా కనిపిస్తాయి. అందుకే చాలామంది మొటిమలు కనిపించగానే గిల్లుతుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. అయితే అలా చేయద్దని.. మొటిమల మీద గోరు గాట్లు పడకుండా చూడాలని బామ్మ చిట్కా. ఈ ప్రాంతంపై కాస్మెటిక్ యాంటీ బాక్టీరియల్ ప్లాస్టర్‌ని వేయడం వల్ల జాగ్రత్త తీసుకోవచ్చు. ప్లాస్టర్ చర్మంపై సున్నితంగా ఉంటుంది. బ్యాక్టీరియా మొటిమను వేగంగా నయం చేస్తుంది. ఒక్కరోజులోనే మీరు మార్పును గమనించవచ్చు. 

పెరుగు బ్యూటీ ప్యాక్ : పెరుగు పుల్లగా అయితే పారేయకండి. దీన్ని చక్కటి ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. దీనివల్ల మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. మరి దీన్నెలా తయారు చేయాలంటే.. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనెలను పెరుగులో వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మేకప్ బ్రష్ తీసుకొని మీ ముఖానికి అప్లై చేయాలి. ఆరిపోయే వరకు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తరువాత చర్మం తేడాను మీరే గమనిస్తారు.

ముఖాన్ని బ్లీచింగ్ చేయడానికి శనగపిండి : ముఖం మీద హెయిర్ ఉందా.. అది చికాకుగా అనిపిస్తుంది. దీన్ని కనిపించకుండా చేయడానికి ఒక హోం రెమెడీ ఉంది. పెరుగుతో శనగపిండి కలిపి బ్లీచింగ్ లా వాడొచ్చు. ఇది మీ చర్మాన్ని బ్లీచ్ చేస్తుంది, శుభ్రపరుస్తుంది. జిడ్డు చర్మం కోసం, గోధుమ పిండిని పాలతో కలిపి వాడాలి. ఇది ముఖంపై ఏర్పడే అనేక మచ్చలు, మరకలు లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. 

గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం.. : నల్లటి మీ పెదాలను చూసుకుంటే ఇబ్బందిగా అనిపిస్తుందా? గులాబీ రేకుల్లాంటి అందమైన పెదాల కోసం ఈ బామ్మ చిట్కాను ప్రయత్నించండి. తెల్ల చక్కెరను అదే మొత్తంలో కాఫీ పొడితో కలపండి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల ఆలివ్ /కొబ్బరి నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, మీ పెదవులపై 15 నిమిషాలు సున్నితంగా రుద్దాలి. చక్కటి ఫలితాలు కావాలంటే వారానికి 1-2 సార్లు ఇలా చేయాలి. 

పెట్రోలియం జెల్లీతో బ్లాక్ హెడ్స్ తొలగించొచ్చు : ఇది అందరికీ పనికివచ్చే అద్భుతమైన చిట్కా.. ప్రభావిత ప్రాంతంలో పెట్రోలియం జెల్లీని అప్లై చేసి, ప్లాస్టిక్ ర్యాప్‌తో కవర్ చేయండి. దీన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ప్లాస్టిక్ రాప్ ను తీసేసి.. బ్లాక్ హెడ్స్ ను తీయడానికి కాటన్ బడ్స్ ఉపయోగించండి. ఇప్పుడు చూడండి మీ ముఖం బ్లాక్ హెడ్ ఫ్రీ గా మారి మెరిసిపోతుంది. 

click me!