Ugadi: ఉగాదికి ఇంటిని ఇలా అందమైన రంగ వల్లులతో నింపేయండి
చైత్రమాసం మొదటి రోజుని ఉగాది పండగగా మనమంతా జరుపుకుంటాం. మరి, ఈ పండగను స్పెషల్ గా జరుపుకోవాలి అంటే.. ఇలాంటి అందమైన రంగవల్లులను ఇంటి ముందు నింపేయండి.
చైత్రమాసం మొదటి రోజుని ఉగాది పండగగా మనమంతా జరుపుకుంటాం. మరి, ఈ పండగను స్పెషల్ గా జరుపుకోవాలి అంటే.. ఇలాంటి అందమైన రంగవల్లులను ఇంటి ముందు నింపేయండి.
ఉగాది పండుగను హిందువుల నూతన సంవత్సరంగా కూడా పిలుస్తారు. ఈ రోజున దక్షిణ భారతదేశంలో బ్రహ్మ దేవుడిని పూజిస్తారు. ఈ రోజున ప్రజలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు లేదా గృహ ప్రవేశం చేస్తారు. ఆరు రుచులు కలిపి ఉగాది పచ్చడిగా చేసుకొని స్వీకరిస్తారు. ఇలాంటి పండగను మరింత స్పెషల్ గా చేయడానికి మీ ఇంటిని రంగవల్లులతో నింపేయండి. కొన్ని ఉగాది పండగను ప్రతిబింబించే రంగవల్లులను చూద్దాం..
ఉగాది రోజున మీరు మీ ఇంటి వద్ద ఇలాంటి అందమైన కలశం డిజైన్‌ను తయారు చేసి, అందులో హ్యాపీ ఉగాది అని రాసి రంగోలి వేయవచ్చు. చూడటానికి బాగుంటుంది.
చైత్ర మాసంలో మామిడి పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండుగను మామిడి పండ్లతో కూడా ముడి వేస్తారు. కాబట్టి మీరు ఈ రకమైన రంగోలిని తయారు చేయవచ్చు, ఇందులో మామిడి చెట్టు కొమ్మపై ఒక పక్షి కూర్చుని ఉంటుంది. పండగ మొత్తం ఈ ముగ్గులోనే కనపడుతుంది.
ఉగాదికి ఈ రకమైన రౌండ్ షేప్ రంగోలి డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇందులో ఒకవైపు కలశం, మరోవైపు మామిడి పండును తింటున్న పక్షిని వేశారు. చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.
మీరు ఎకో ఫ్రెండ్లీ రంగోలి వేయాలనుకుంటే, ఈ విధంగా బంతి పువ్వులతో రంగోలి వేయవచ్చు. ఇది ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల కూడా చాలా అందంగా ఉంటుంది.
పూల రంగోలిలో ఈ రకమైన రౌండ్ షేప్ రంగోలి మీ ఇంటికి చాలా అందమైన రూపాన్ని ఇస్తుంది. రంగు రంగుల పూలు ఎలాంటి పండగ ఆనందాన్ని అయినా డబుల్ చేస్తాయి.
మీరు ఫ్లాట్‌లో నివసిస్తుంటే, మీ ఇంటి వెలుపల ఎక్కువ స్థలం లేకపోతే, మీరు మీ ఇంటి మూలలో ఈ రకమైన సైడ్ డిజైన్‌ను రంగోలి రూపంలో వేయవచ్చు.