చర్మ సౌందర్యానికి పసుపు... ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?...

First Published | Jul 23, 2021, 12:37 PM IST

పసుపులోని కర్కుమిన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే బయో యాక్టివ్ కాంపోనెంట్.

పసుపు ఔషధలక్షణాలకు, సౌందర్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. పసుపులోని కర్కుమిన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే బయో యాక్టివ్ కాంపోనెంట్.
undefined
పసుపు చర్మానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని సరిగా వాడితే సహజ సౌందర్యం మీ సొంతమవుతుంది. అదెలాగో.. చూడండి..
undefined

Latest Videos


చర్మకాంతికి : పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెట్స్ చర్మాన్ని మెరిపించడంలో సహాయపడతాయి. చర్మ సహజ కాంతిని బయటకు తీసుకురావడంలో పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం కొద్దిగా గ్రీకు పెరుగు, తేనె, పసుపు కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ అంతా అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు వదిలేసి.. ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగాలి.
undefined
మొటిమల మచ్చలను తగ్గిస్తుంది : ప్రతి వ్యక్తి జీవితకాలంలో ఒకసారి ఎదుర్కొనే సాధారణ చర్మ సమస్య మొటిమలు. ఈ మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయపడే అద్భుత సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. పసుపు లోని క్రిమినాశక లక్షణాలు బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఆపి, మొటిమల వల్ల చర్మం మీద కలిగే ఎరుపును, మచ్చలను తగ్గిస్తాయి.
undefined
దీనికోసం 1 టీస్పూన్ పసుపు ను, 1 టీస్పూన్ ఫుల్లర్స్ ఎర్త్, పెరుగులతో కలపాలి. కావాలంటే దీంట్లో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కూడా జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ అంతా అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను వేసుకుంటే మంచిది.
undefined
నల్లటి వలయాలు : కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తొలగించడంలో పసుపులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు బాగా ఉపయోగపడతాయి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ పెరుగులో రెండు చుక్కల నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పసుపు కలపాలి. ఈ పేస్ట్‌ను డార్క్ సర్కిల్స్‌లో మీద జాగ్రత్తగా అప్లై చేసి 15 -20 నిమిషాలు ఉంచండి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
undefined
స్ట్రెచ్ మార్క్ ను పోగొడుతుంది : పసుపు స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టడంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం సగం టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి.. దీన్ని మచ్చలున్న ప్రాంతంలో పూయాలి. ఓ గంట తరువాత దీన్ని మామూలు నీటితో కడిగి తడి ఆరాక మాయిశ్చరైజర్ పూయాలి. క్రమం తప్పకుండా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ దాదాపుగా కనిపించకుండా పోతాయి.
undefined
స్ట్రెచ్ మార్క్ ను పోగొడుతుంది : పసుపు స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టడంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం సగం టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి.. దీన్ని మచ్చలున్న ప్రాంతంలో పూయాలి. ఓ గంట తరువాత దీన్ని మామూలు నీటితో కడిగి తడి ఆరాక మాయిశ్చరైజర్ పూయాలి. క్రమం తప్పకుండా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ దాదాపుగా కనిపించకుండా పోతాయి.
undefined
click me!