ఈ స్ట్రీట్ ఫుడ్స్ ను డైటింగ్ లోనూ లాగించొచ్చు...

First Published Jul 23, 2021, 12:07 PM IST

స్ట్రీట్ ఫుడ్స్ ఎలాంటి వారినైనా టెంప్ట్ చేస్తాయి. ఎంత కఠినమైన డైట్ నియమాలు అనుసరిస్తున్న వాళ్లైనా స్ట్రీట్ ఫుడ్ విషయంలో ఒక్కోసారి జిహ్వను ఆపుకోలేరు. అయితే డైటింగ్ అనగానే ప్రతీదానికి దూరంగా ఉండడం కాదు.. ఆయా ఆహారాల గురించి పూర్తిగా తెలుసుకుని పాటిస్తే... ఎంచక్కా ఇష్టమైనవి తింటూ కూడా డైట్ చేయచ్చు. 

డైటింగ్ అంటేనే నోటికి కట్టేసుకోవడం.. ఇష్టమైన ఫుడ్ ను దూరంగా పెట్టడం.. అప్పుడే.. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. సరైన ఆరోగ్యం పొందగలుగుతారు.
undefined
స్ట్రీట్ ఫుడ్స్ ఎలాంటి వారినైనా టెంప్ట్ చేస్తాయి. ఎంత కఠినమైన డైట్ నియమాలు అనుసరిస్తున్న వాళ్లైనా స్ట్రీట్ ఫుడ్ విషయంలో ఒక్కోసారి జిహ్వను ఆపుకోలేరు. అయితే డైటింగ్ అనగానే ప్రతీదానికి దూరంగా ఉండడం కాదు.. ఆయా ఆహారాల గురించి పూర్తిగా తెలుసుకుని పాటిస్తే... ఎంచక్కా ఇష్టమైనవి తింటూ కూడా డైట్ చేయచ్చు.
undefined
అలా డైటింగ్ లో ఉంటూ కూడా తినదగిన కొన్ని స్ట్రీట్ ఫుడ్ డిటైల్స్ మీ కోసం..
undefined
పన్నీర్ టిక్కా : తందూరి పన్నీర్ టిక్కా, మలై పన్నీర్ టిక్కా, మసాలా పన్నీర్ టిక్కా వరకు అనేక రకాల టిక్కాలు మీరు డైట్ లో ఉన్నప్పుడు తినొచ్చు. పన్నీర్ టిక్కాలో అసలు నూనెనే వాడరు. వాటిని గ్రిల్లింగ్ లేదా తంథూరీలో ఉడికిస్తారు. పెరుగు, మసాలా పేస్ట్‌తో మారినేట్ చేసిన పన్నీర్ టిక్కా మీ జిహ్వకు అద్భుతమైన రుచిని ఇస్తూనే.. కడుపు నింపేస్తుంది. దీన్ని ఉల్లిపాయలు, పుదీనా పచ్చడితో తింటే అదిరిపోతుంది.

మూంగ్లెట్ : మూంగ్లెట్ అనేది బేసన్ చీలా మృదువైన రకం.. దీన్ని పసుపురంగు పెసరపప్పుతో తయారు చేస్తారు. మూంగ్లెట్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది వెయిట్ లాస్ డైట్ ఫాలో అయ్యేవారికి చక్కగా సరిపోతుంది. దీనికోసం ముందుగా పెసరపప్పును నానబెట్టి ఇందులో సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్ వంటి కూరగాయలు వేసి మెత్తగా మిక్సీ చేస్తారు. తరువాత దీన్ని నురగ వచ్చే వరకు విస్క్ చేసి పాన్ మీద దోశలా వేసి కాలుస్తారు. చింతపండు పచ్చడితో కలిపి తింటే చాలా బాగుంటుంది.
undefined
భెల్ పూరి : భెల్ పూరి ప్రసిద్ధ మహారాష్ట్ర స్నాక్ ఐటమ్. దేశవ్యాప్తంగా దీని రుచికి బాగా ప్రాచుర్యం పొందింది. మరమరాలు, సెవ్, ఉల్లిపాయ, టమోటా, చింతపండు పచ్చడి, పుదీనా పచ్చడి, నిమ్మరసం, మాత్రితో తయారు చేసిన భెల్ పూరి.. చక్కటి వేడి వేడి టీతో తీసుకోగలిగే..రుచికరమైన చిరుతిండి. ఈ ‘బీచ్ స్నాక్’ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైట్ కి చాలా మంచిది.
undefined
షకర్కండి చాట్ : షకర్కండి చాట్ లేదా చిలగడదుంప చాట్ ఒక ప్రసిద్ధ ఉత్తర భారతీయ చిరుతిండి, ఇది స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. ఉడకబెట్టిన తీపి చిలగడదుంప, కొన్ని మసాలా దినుసులతో చాట్ తయారు చేస్తారు. ఇది చిరుతిండిని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఉడికించిన చిలగడదుంపలను తొక్క తీసి, నలుచదరపు ముక్కలుగా కోసి, నిమ్మరసం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, రాక్ సాల్ట్ కలపడమే. ఇంకా మంచి టేస్ట్ కావాలంటే చాట్ కు సేవ్, దానిమ్మ గింజలు కూడా చేర్చుకోవచ్చు.
undefined
మసాలా కార్న్ : చినుకులు పడుతున్న వేళ వేడివేడి మక్కజొన్న పొత్తు తింటే ఆహా.. ఆ రుచే వేరు. ఇక మక్కజొన్న గింజలకు మసాలాను జోడిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మసాలా కార్న్ ను ఇలాగే తయారు చేస్తారు. డైట్ లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైనది. దీంట్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు అస్సలే ఉండదు.
undefined
దీన్ని మొక్కజొన్న గింజల్ని ఉడికించి తరువాత దీనికి నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, చాట్ మసాలా, ఎర్ర కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కలిపి తినేయడమే.
undefined
click me!