వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే.. తులసి-పసుపు కషాయం...

First Published Aug 6, 2021, 1:58 PM IST

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి-పసుపులతో తయారు చేసిన కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు థార్డ్ వేవ్ భయపెడుతోంది. దీన్నుంచి తప్పించుకోవాలన్నా.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రతీ ఒక్కరూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 

వర్షాకాలం వచ్చేసింది. వాతావరణంలో తేమ చేరుతోంది. వర్షం నీటితో ప్రకృతి పచ్చగా మారిపోయింది. దీంతో పాటే ఎన్నో రకాల వ్యాధులు పొంచి ఉన్నాయి. వీటినుంచి తప్పించుకోవాలంటే.. రోగ నిరోధక శక్తి అవసరం. ఇప్పటివరకు ఎండలకు తట్టుకోవడానికి తీసుకున్న ఆహారపదార్థాలు ఇప్పుడు మార్చుకోవాలి. వర్షాకాలపు తేమను తట్టుకుంటూ శరీరాన్ని చల్లబరుస్తూనే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలవైపు దృష్టి పెట్టాలి.
undefined
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి-పసుపులతో తయారు చేసిన కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు థార్డ్ వేవ్ భయపెడుతోంది. దీన్నుంచి తప్పించుకోవాలన్నా.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రతీ ఒక్కరూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
undefined
ఓ వైపు రోజురోజుకూ రూపు మార్చుకుంటూ... కొత్త కొత్త వేరియంట్లుగా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి. మరోవైపు వర్షాలతో పుట్టుకొచ్చే రకరకాల సూక్ష్మక్రిములు, వీటితో పాటే మోసుకొచ్చే సీజనల్ వ్యాధులు ఇప్పుడు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఏ మాత్రం బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నా ఈ సీజన్‌లో ఈ రెండింటిలో ఏదో ఒక దానికి దొరికి పోవడం ఖాయం. అందుకే మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చాలి, మాన్ సూన్ సీజన్‌లో బయట తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
సీజనల్ వ్యాధులతో పోరాడటానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేసే మిశ్రమాలలో ఒకటి తులసి-హల్దీ కలయిక. ఈ పానీయం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. గొంతు నొప్పి, గరగర, జలుబులు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
undefined
ఈ కడా లేదా కషాయాన్ని ఎలా తయారు చేయాలంటే... కావాల్సిన పదార్థాలు... అర టీస్పూన్ పసుపు 8-12 తులసి ఆకులు 2-3 టేబుల్ స్పూన్లు తేనె 3-4 లవంగాలు 1 ముక్క దాల్చిన చెక్క
undefined
ఈ కడా లేదా కషాయాన్ని ఎలా తయారు చేయాలంటే... కావాల్సిన పదార్థాలు... అర టీస్పూన్ పసుపు 8-12 తులసి ఆకులు 2-3 టేబుల్ స్పూన్లు తేనె 3-4 లవంగాలు 1 ముక్క దాల్చిన చెక్క
undefined
తయారు చేసే విధానం.. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. దీంట్లో పసుపు, తులసి ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మరగనివ్వాలి. 15 నిమిషాల పాటు మరిగించాలి. దీనికోసం ఫిల్టర్ వాటర్ నే వాడాలి. 15 నిమిషాల తర్వాత నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యేవరకు అలాగే ఉంచాలి. తరువాత దీనికి రుచిని పెంచడానికి కొద్దిగా తేనెను కలిపి తాగేయడమే. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూని తగ్గించడానికి దీన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

ఆరోగ్య ప్రయోజనాలు -డయాబెటిక్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -శరీరంలోని విషపదార్థాలను తొలగించి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. - మలబద్ధకం, లూజ్ మోషన్స్ లాంటి సమస్యలు కూడా ఈ పానీయం చక్కటి పరిష్కారంగా ఉంటుంది. - జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
undefined
click me!