Ghee Massage: అరికాళ్ళకు నెయ్యితో మసాజ్ చేసుకొని చూడండి, మీలో ఎన్నో మార్పులు

Published : Sep 15, 2025, 01:45 PM IST

నెయ్యిలో పోషక గుణాలు ఎక్కువ. నెయ్యితో అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఒక స్పూన్ నెయ్యి తీసుకుని అరికాళ్ళను మసాజ్ చేస్తే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకోండి. 

PREV
15
అరికాళ్ల మసాజ్

అరికాళ్ళను మసాజ్ చేయడం అనేది ఎంతో మంచి పద్ధతి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరికాళ్ళల్లో మసాజ్ చేస్తే శరీరానికి రక్తప్రసరణ మెరుగుపడుతుందని చెబుతారు. ముఖ్యంగా రోజంతా పనిచేసిన అలసట పోవాలన్నా కూడా అరికాళ్ళను మసాజ్ చేసుకోవాలి. అయితే దేశీ నెయ్యితో అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

25
ఎముకల నొప్పులు తగ్గుతాయి

ఇంట్లో నెయ్యిని కొంత తీసుకొని అరికాళ్ళపై మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న ఎన్నో నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఎముకల నొప్పులు తగ్గే అవకాశం ఉంది. రాత్రిపూట ఇలా అరికాలను మసాజ్ చేసుకోవడం వల్ల గాఢ నిద్ర పడుతుంది. నెయ్యితో అరికాళ్లను మసాజ్ చేసుకోవడం అన్నది ఈనాటి పద్ధతి కాదు. పూర్వకాలంలో ఎంతోమంది దీన్ని ప్రయత్నించేవారు.

35
కీళ్లనొప్పులు తగ్గడం ఖాయం

నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి నెయ్యితో అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు చాలా వరకు తగ్గుతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ‌ శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది.

45
నిద్ర పడుతుంది

నిద్రా సమస్యలతో ఇబ్బంది పడేవారు.. ప్రతిరోజు రాత్రి అరికాళ్ళను నెయ్యితో మసాజ్ చేసుకోండి. మీకు హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా అరికాళ్ళపై నెయ్యిని రాయడం అలవాటు చేసుకోవాలి.

55
నెయ్యి తినడం అవసరం

నెయ్యిలో ఆహారపరంగా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక స్పూను నెయ్యి ఆహారంలో భాగం చేసుకుంటే మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది బరువు పెరుగుతామనే భయంతో నెయ్యిని తినరు. నిజానికి రోజుకి అర స్పూను లేదా ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవడం వల్ల మీరు బరువు పెరగరు. పైగా బరువు తగ్గే ప్రయాణానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీరు అతిగా నెయ్యిని తీసుకుంటారో అప్పుడే బరువు పెరుగుతారు. కాబట్టి శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎంతో కొంత నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories