Health Tips: మీరెప్పుడూ తాగని బనానా టీ.. ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా..?

Published : Aug 05, 2022, 12:51 PM IST

Health Tips: అరటి టీ నా..! అని ఆశ్చర్యపోయే వారు చాలా మందే ఉన్నారు. కానీ దీన్ని తాగడం వల్ల నిద్రలేమి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయన్న ముచ్చట మీకు తెలుసా..?   

PREV
18
Health Tips: మీరెప్పుడూ తాగని బనానా టీ.. ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా..?

బనానా టీ లో సెరోటోనిన్, ట్రిప్టోఫాన్, డోపామైన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రిళ్లు హాయిగా నిద్రపట్టడానికి ఎంతో సహాయడతాయి. కండరాలను సడలిస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

28

పండులో విటమిన్ బి6  కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. హార్ట్ పేషెంట్లకు అరటి టీ ఎంతో మేలు చేస్తుందని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 
 

38

అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో ఉండే మెగ్నీషియం ఎముకల బలాన్ని పెంచడానికి, వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందుకే బలహీనమైన ఎముకలతో బాధపడేవారు ఈ టీని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఉంటాయి: అరికెలలో ఉండే క్యాల్షియం (Calcium) ఎముకల దృఢత్వానికి (Bone Strength) సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.  

48

అరటిపండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం జీర్ణక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఈ బనానా టీ కండరాల ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 

58

అరటిపండ్లలోని పొటాషియం.. ధమనులు, సిరలపై ఒత్తిడిని సమతుల్యం చేస్తుంది. అలాగే అధిక రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

68

అరటిపండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అరటిపండ్లను తింటే కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అరటి రెటీనా, శుక్లాలు, ఆక్సీకరణ ఒత్తిడిలో మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

78

బనానా టీలో ఉండే సెరోటోనిన్, డోపామైన్  హార్మోన్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు హ్యాపీ హార్మోన్ల రిలీజ్ అయ్యేలా చేస్తాయి. 
 

88

అరటి టీ తయారీ విధానం

తొక్కతో లేదా తొక్కను తీసేసి అరటిపండును నీటిలో కొద్దిసేపు ఉడకబెట్టండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అరటిపండును మొత్తమే తీసేయండి. ఆ నీటిని వడకట్టి బ్లాక్ టీ లేదా మిల్క్ టీలో మిక్స్ చేసి తాగాలి. 

Read more Photos on
click me!

Recommended Stories