Underwater Train Journey: సముద్రం అడుగున రైలు ప్రయాణం... అద్భుతమైన ట్రైన్ జర్నీ ఎక్కడో తెలుసా?

Published : Nov 10, 2026, 01:07 PM IST

Underwater Train Journey: ఇప్పటి వరకు రైలు ప్రయాణం చాలా సార్లు చేసే ఉంటారు. కానీ, సముద్రం అడుగున నీటి మధ్యలో రైలు ప్రయాణం ఎప్పుడైనా చేశారా? ఇలాంటి రైలు ప్రయాణం ఎక్కడ చేయగలరో తెలుసా?

PREV
12
సముద్రంలో రైలు ప్రయాణం..

సముద్ర ప్రయాణం అంటే.. మనకు ఇప్పటి వరకు ఓడలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ, నీటిలో నడిచే రైలు గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా సముద్రం లోపల.. చేపల నడుమ రైలులో ప్రయాణించడం.. వినడానికే వింతగా ఉన్నా.. నిజంగా ఇలాంటి ప్రయాణం ఉంది. నిజానికి, ఇలాంటి ప్రయాణాలు మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి ప్రయాణం ఉంది. ఆ జర్నీని రుచి చూడాలంటే.. మీరు హాంగ్ కాంగ్ లోని ఓషన్ పార్క్ కు వెళ్లాల్సిందే. అక్కడ ఉండే ‘ ఓషన్ ఎక్స్ ప్రెస్’ అనే సబ్ థీమ్ పర్యాటకులను ఓ అద్భుత లోకంలోకి తీసుకువెళ్తుంది. మరి, ఈ రైలు విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం...

22
ఏమిటీ ఓషన్ ఎక్స్ ప్రెస్...

ఇది ఎక్కడో పట్టాలపై నడిచే సాదాసీదా రైలు కాదు. అచ్చం ఒక సబ్ మెరైన్ లానే ఉంటుంది. సబ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రైలును డిజైన్ చేశారు. ఓషన్ పార్క్ లోని వాటర్ ఫ్రంట్, సమ్మిట్ అనే రెండు ప్రధాన ప్రాంతాలను ఈ రైలు కలుపుతుంది.

సముద్ర గర్భంలో దాదాపు 1.3 కిలోమీటర్ల పొడవు ఉండే సొరంగ మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు కదులుతున్నంత సేపు కిటికీల్లో నుంచి మనకు చేపలు, పెద్ద పెద్ద సముద్ర జీవులు క్లియర్ గా కనిపిస్తాయి. నీటి అడుగున దృశ్యాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా సరదాగా సాగే ఈ ప్రయాణం మాత్రం కేవలం 4 నిమిషాల పాటే ఉంటుంది. కానీ, ఒకేసారి 5వేల మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించగలరు.

ఈ రైలు టికెట్ ధరలు ఎలా ఉంటాయంటే....

ఓషన్ పార్క్ హాంగ్ కాంగ్ సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది.

పెద్దలు (12 ఏళ్లు పైబడిన వారు): HK$538 (సుమారు ₹6,496)

పిల్లలు (3 నుండి 11 ఏళ్ల లోపు వారు): HK$269 (సుమారు ₹3,248)

వృద్ధులు (60 నుండి 64 ఏళ్ల JoyYou కార్డ్ హోల్డర్లు): HK$100 (సుమారు ₹1,207)

ఈ ఓషన్ పార్క్ లో ఇంకా ఏం చూడొచ్చు...

ఈ అండర్‌వాటర్ రైలు ప్రయాణమే కాకుండా, ఓషన్ పార్క్‌లో పర్యాటకులను అలరించే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి:

భారీ గ్రాండ్ అక్వేరియం,అందమైన జెయింట్ పాండాలు, రోలర్ కోస్టర్స్, ఉత్కంఠభరిత రైడ్స్ కూడా ఉంటాయి. పిల్లలు ఈ రైడ్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories