ఇండియాలోని టాప్ బడ్జెట్ రొమాంటిక్ హనీ మూన్ డెస్టినేషన్స్ ఇవే..!

First Published Jun 16, 2021, 4:05 PM IST

హనీమూన్ కి ఎక్కడికి వెళ్లమనేదానికన్నా ఆ ప్రదేశం ఆ జంటను ఎంత దగ్గర చేసిందనేది ఇంపార్టెంట్. మీ కోసం భారతదేశంలో ఉన్న టాప్ 9 బడ్జెట్ రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్స్ వివరాలను అందిస్తున్నాం

1. సిక్కింఉత్తర భారతదేశంలో దాగి ఉన్న ఈ అందమైన రొమాంటిక్ ప్లేస్ అద్భుతమైన కట్టడాల కు ఎన్నో మొనాస్టరీలకు నెలవు. మొనాస్టరీలు అంటే బౌద్ధ మత సాధువులు నివసించే చోటు. ఈ మొనాస్టరీలలోని ప్రశాంతత, చుట్టూ పరుచుకున్న ప్రకృతి అందాలు, దూరంలో ఎత్తైన మంచు శిఖరాలు మిమ్మల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్ అందాలు, దగ్గర్లో ఉన్న డార్జిలింగ్ టీ తోటలు కూడా సైట్ సీయింగ్ కి బెస్ట్ ప్లేసెస్. ఇక్కడ సింగుడి లేక్, బ్రిటిష్ శైలిలో ఉన్న ఆర్కిటెక్చర్ కళ్ళు తిప్పుకోనివ్వవు.ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, సిక్కిం వెళ్లడానికి అన్ని కాలాలు అనుకూలమే. ఒకవేళ మీరు ఇక్కడ హనీమూన్ ప్లాన్ చేసుకున్నట్లైతే కేవలం 30 వేల బడ్జెట్లో ఐదు నుండి ఆరు రోజులు ఈ ప్లేస్ ను ఎంజాయ్ చేయొచ్చు
undefined
2. అండమాన్ ఐలాండ్స్3000 ద్వీపాల కలయిక అయిన అండమాన్ ఐలాండ్స్, మీ బిజీ లైఫ్ స్టైల్ నుండి మిమ్మల్ని కాస్త దూరంగా తీసుకెళ్లి, రొమాంటిక్ సెన్స్ ను ఆడ్ చేస్తాయి. సుదూరమైన సముద్రతీరాలు చూస్తూ ...పక్కనే ఉన్న లైఫ్ పార్ట్నర్ తో గడిపే ప్రతీ క్షణం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోయేలా చేస్తుంది ఈ ప్లేస్. ఇక్కడికి వెళ్ళినట్లయితే లైమ్ స్టోన్ కేవ్స్ ను, ఎలిఫెంట్ బీచ్ ను తప్పకుండా చూడాలి. అంతే కాదు ఇక్కడ ఉన్న ట్రైబల్స్ లైఫ్ స్టైల్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇక ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ గా చెప్పుకునే రాధానగర్ బీచ్ లో సన్ సెట్ ని అస్సలు మిస్ అవ్వద్దు. కేవలం 20 వేల తో 6 నుండి 15 రోజులు ఇక్కడ హనీమూన్ ప్లాన్ వేసుకున్నట్లయితే యూనిక్ ఎక్స్పీరియన్స్ మీ సొంతమవుతుంది.
undefined
3. ఉదయపూర్మీరు, మీ లైఫ్ పార్ట్నర్ రాజస్థాన్ అందాలను, కల్చర్ ను చూడాలంటే బెస్ట్ ప్లేస్ ..."సిటీ అఫ్ లేక్స్' గా పిలుచుకునే ఉదయపూర్. నిన్న మొన్నటి వరకూ బాగా పాపులర్ అయిన నిహారిక కొణిదెల వివాహం కూడా జరిగింది ఈ ఉదయ్పూర్ ప్యాలెస్ లోనే... చుట్టూ సరస్సు... మధ్యలో ప్యాలెస్ ... లేక్ ఒడ్డున మీ లైఫ్ పార్ట్నర్ తో సరదాగా నడుస్తూ, కబుర్లు చెబుతూ, సెల్ఫీస్ దిగుతూ అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. ప్రపంచంలోనే కొన్ని అద్భుతమైన ఇంస్టాగ్రామ్ ఫోటో స్పాట్స్ ఇక్కడే ఉన్నాయి.
undefined
4. గోవా"పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా" గా పిలుచుకునే గోవా హనీమూన్ కి ఎప్పుడు బెస్ట్ ఛాయిస్. కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ లో ఐదు నుండి పది రోజులు గోవా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. పార్టీ కల్చర్ కావాలనుకునే వారికి నార్త్ గోవా బెస్ట్ ప్లేస్.అందులో కాండోలిమ్ బీచ్, కాలంగుట్ బీచ్ లు మధురానుభూతినిస్తాయి.ఇక మీ హనీమూన్ పీస్ ఫుల్ గా సాగాలంటే సౌత్ గోవా బెస్ట్ ప్లేస్.గోవా వరకూ వెళ్లి దూద్ సాగర్ ఫాల్స్ ను మిస్ చేస్తే ఎలా.. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో మాదిరి ట్రైన్ లోనుంచి ఆ దూద్ సాగర్ ఫాల్స్ వ్యూ భలే అద్భుతంగా ఉంటుంది. మీ ఇద్దరిలో పార్టీ అనిమల్ ని నిద్రలేపాలనుకుంటే గోవా ఈజ్ ది బెస్ట్ ఛాయస్.
undefined
5. లడక్:"హిమాలయ ఎడారి"గా పిలుచుకునే లధాక్ ను హనీమూన్ కి బెస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు. లడక్ ముఖ్య నగరం లేహ్. మనాలి నుండి లెహ్ వరకు బైక్ మీద రయ్ మని దూసుకుపోతుంటే ... బ్యూటిఫుల్ హనీమూన్ మెమరీస్ మీ సొంతమవుతాయి. అయితే ఇక్కడికి హనీమూన్ ట్రిప్ కి వెళ్లేముందు వెదర్ సిచువేషన్ ను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే డేంజరస్ రోడ్ జర్నీస్ లో ఈ ప్లేస్ కూడా ఒకటి. ప్రసిద్ధ బౌద్ధారామాల్లో ఒకటైన తెక్సీ గొరసిల్ వ్యూ ను ఖచ్చితంగా చూడాల్సిందే. చాదర్ ట్రెక్కింగ్ కూడా యూనిక్ ఎక్స్పీరియన్స్
undefined
6. లక్షద్వీప్మీ హనీమూన్ ట్రిప్ అక్టోబర్ టు మార్చ్ లో ప్లాన్ చేసుకున్నట్లయితే కేవలం 15 వేల రూపాయల లో ఐదు నుండి పది రోజులు మీకు బ్యూటిఫుల్ హనీమూన్ మెమోరీస్ ను అందించే ప్లేస్ లక్షద్వీప్. స్కూబా డైవింగ్ చేస్తూ లక్షల్లో ఉన్న సముద్ర జీవులను చూస్తూ ఎంజాయ్ చేయడం ఒక అద్భతమైన అనుభూతి. తెల్లటి ఇసుకతో నిండి ఉన్న బీచులు, నీలి రంగులో సముద్రం అబ్బ... ఎంత చెప్పినా తక్కువే..!ఆ బీచ్ లో అలా సముద్రాన్ని చూస్తూ కూర్చుండిపోవచ్చు.
undefined
7. కాశ్మీర్క్రౌన్ ఆఫ్ ఇండియా గా పిలుచుకునే కాశ్మీర్ హనీమూన్ కు బెస్ట్ ఛాయిస్. చల్లనైన మంచు ప్రాంతాల్లో వెచ్చని మీ లైఫ్ పార్టనర్ కౌగిట్లో ఎంజాయ్ చేస్తూ హనీమూన్ ని లైఫ్ టైం మెమరీ గా మార్చుకోవడానికి కాశ్మీర్ మంచి ప్లేస్. శ్రీనగర్ , పహల్ గావ్, గుల్మార్గ్, సొన్ మార్గ్ సహా అనేక చూడదగ్గ ప్రదేశాలు కాశ్మీర్ సొంతం. దాల్ సరస్సులో శిఖర బోట్ రైడ్ మీకు జీవితకాలపు అనుభూతులను మిగిలిస్తుందంటే నమ్మండి. ఇక ఇంత అందమైన ప్రదేశాన్ని కి మీరుకేవలం 15000- రూపాయల తో 5-7 రోజుల హనీమూన్ ప్లాన్ వేసుకోవచ్చు.
undefined
8. కేరళభూతల స్వర్గం గా పిలవబడే కేరళను బెస్ట్ హనీమూన్ ప్లేస్ అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఇక్కడ దొరికే సీ ఫుడ్, వైల్డ్ లైఫ్ వ్యూ మరెక్కడా లేవనే చెప్పాలి. ఇక అలెప్పి లోని హౌజ్ బోట్ స్టే మీ హనీమూన్ ను బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ గా మారుస్తుంది. ఆ హౌజ్ బోట్ లో సేదతీరుతూ... కేరళ బ్యాక్ వాటర్ అందాలను వీక్షిస్తూ, నోరూరించే సీ ఫుడ్ ని లాగిస్తుంటే.... ఆ ఆనందమే వేరు.ఇక కేరళ వెళ్లడానికి కంఫర్టబుల్ టైం సెప్టెంబర్ టు మార్చ్. ఇక్కడ ఆరు నుండి ఎనిమిది రోజులు హనీమూన్ ప్లాన్ వేసుకున్నట్లయితే 25000 లో మీ హనీమూన్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది.
undefined
9. పుదుచ్చేరిమన ఇండియాలోనే యూరోపియన్ వెకేషన్ ఫీల్ రావాలంటే పుదుచ్చేరి వెళ్లాల్సిందే. డైవర్సి పైడ్ కల్చర్, నోరూరించే సీఫుడ్ ను ఆస్వాదిస్తూ, ఫ్రెంచ్ స్టయిల్లో ఉన్న ఆర్కిటెక్చర్ ను ఎంజాయ్ చేస్తూ... మీ లైఫ్ పార్టనర్ తో ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు. పాండిచ్చేరి అందాలను అలా మీ జీవిథ్య భాగస్వామి చేయి పట్టుకొని నడుస్తూ ఆ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ని చూస్తూ ఆనందిస్తే ఆ మజాయే వేరు.
undefined
click me!