Education Tips : (a+b)² ఫార్ములా a²+2ab+b² ఎందుకు? పిల్లలకు చెప్పేముందు పేరెంట్స్ తెలుసుకోవాల్సిన మ్యాథ్స్ ట్రిక్

Published : Jun 17, 2026, 02:44 PM IST

పిల్లల హోంవర్క్‌లో హెల్ప్ చేయాలంటే పేరెంట్స్ కొన్ని మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోవాల్సిందే. అందుకే సింపుల్ మ్యాథ్స్ ఫార్ములా (a+b)²=a²+2ab+b² గురించి ఇక్కడ తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ వివరణ

PREV
13
(a+b)² ఫార్ములాను సింపుల్ గా అర్థం చేసుకొండి

Education Tips : వేసవి సెలవులు ముగిశాయి... ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ తెరుచుకున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు బడిబాట పట్టారు... పుస్తకాలతో కుస్తీ ప్రారంభించబోతున్నారు. అయితే పిల్లలు బాగా చదవడంలో స్కూల్ టీచర్ల పాత్ర ఎంత ఉంటుందో తల్లిదండ్రుల పాత్ర అంతే ఉంటుంది... విద్యార్థులకు క్లాసులో వచ్చే డౌట్స్ టీచర్లు తీరుస్తారు, ఇంట్లో వచ్చే డౌట్స్ పేరెంట్స్ తీర్చాల్సిందే. అంటే కేవలం టీచర్లే కాదు పేరెంట్స్ కూడా పిల్లలను చదివించేందుకు ముందుగా ప్రిపేర్ కావాల్సిందే.

పిల్లలను చదివించేందుకు పేరెంట్స్ పెద్దపెద్ద పుస్తకాలను చదవాల్సిన అవసరం లేదు... చిన్నచిన్న విషయాలు తెలుసుకుంటే చాలు. బేసిక్స్ కూడా తెలియకుంటే పిల్లలను చదవించడం కష్టం అవుతుంది... కాబట్టి తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా పేరెంట్స్ కి మ్యాథ్స్ ఫార్ములాలు తెలిసుండాలి... అందుకోసమే మ్యాథ్స్ లో బేసిక్ ఫార్ములా (a+b)²=a²+2ab+b² ఎలా వస్తుందో తెలుసుకుందాం.

23
(a+b)² ఫార్ములా a²+2ab+b² ఎలా అవుతుంది?

సాధారణంగా axa=a² అవుతుంది. అదే a+a=2a అవుతుంది. ఇది బేసిక్ మ్యాథ్స్. ఇక (a+b)² అంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని 2 సార్లు గుణించాలి... (a+b)x(a+b) అన్నమాట. దీన్ని సింపుల్ గా a(a+b)+b(a+b) గా రాసుకోవచ్చు.

అయితే ముందుగా చెప్పుకున్నట్లు axa=a² అవుతుంది... ఇక axb=ab అవుతుంది. axb=ab,bxb=b² అవుతుంది. అంటే (a+b)²=a²+ab+ab+b² అన్నమాట. ఇక్కడ ab+ab అంటే 2ab కాబట్టి a²+2ab+b² అవుతుంది. ఇలా మొత్తంగా (a+b)² ఫార్ములా a²+2ab+b² వచ్చేసింది.

33
పేరెంట్స్ కి (a+b)² ఫార్ములా తెలియకుంటే ఏమవుతుంది?

స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీచర్లు ఒక్కోక్కరిని కూర్చోబెట్టి పాఠాలుచెప్పడం సాధ్యంకాదు. కాబట్టి పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకున్నారో తెలుసుకోవడం పేరెంట్స్ బాధ్యత. అయితే పిల్లలు చెప్పేది కరెక్టో కాదో తెలియాలంటే ముందుగా తల్లిదండ్రులకు మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి.

(a+b)² ఫార్ములా కూడా చాలామంది పిల్లలు తప్పుగా రాస్తుంటారు. (a+b)²=axa=a², bxb=b² అని భావిస్తారు... అందుకే (a+b)²=a²+b² గా రాస్తుంటారు. ఇది తప్పు అని పేరెంట్స్ చెప్పగలగాలి... ఇందుకోసం (a+b)²=a²+2ab+b² ఎలా అవుతుందో తెలియడం చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories