1. వర్జీనియా-క్లాస్, అమెరికా
అమెరికాకు చెందిన వర్జీనియా-క్లాస్ జలాంతర్గామి అణుశక్తితో నడుస్తుంది. ఇది దాడి చేసే విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. ఇటువంటి 19 జలాంతర్గాములు ఈ నౌకాదళంలో ఉన్నాయి. ఇలాంటివి చాలా ఎక్కువగా అమెరికా తయారు చేస్తోంది. ఈ అణ్వాయుధాల క్రూయిజ్ క్షిపణులు టోమాహాక్ ల్యాండ్ అటాక్ మిస్సైల్(TLAM), స్పియర్ ఫిష్ హెవీ టార్పెడో, హార్పూన్ యాంటీ-షిప్ మిస్సైల్, వర్జీనియా పేలోడ్ ట్యూబ్ (VPT) లను తీసుకెళ్లగలవు. వర్జీనియా-క్లాస్ ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న అత్యంత అధునాతన అణు జలాంతర్గామి.
2. డ్రెడ్నాట్-క్లాస్, యునైటెడ్ కింగ్‌డమ్
UKలో డ్రెడ్నాట్-క్లాస్ జలాంతర్గాములు తయారవుతున్నాయి. ఇవి 16 ట్రైడెంట్ D5 LE క్షిపణులను తీసుకెళ్లగలవు. దీనిలో స్టెల్త్‌ను పెంచడానికి ఆధునిక సాంకేతికతలు ఉపయోగించారు. అదే విధంగా ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించడానికి నూతన టెక్నాలజీని వాడారు.
3. యాసెన్-క్లాస్, రష్యా
యాసెన్-క్లాస్ అనేది రష్యాకు చెందిన జలాంతర్గామి. ఇది అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి జలాంతర్గామి. ఇవి P-800 ఓనిక్స్, కాలిబర్ క్రూయిజ్ క్షిపణులు, అణ్వాయుధాల క్రూయిజ్ క్షిపణులను తీసుకెళ్లగలవు. యాసెన్-క్లాస్ జలాంతర్గాములు రష్యాకు చెందిన అత్యంత అధునాతన మల్టీ రోల్ జలాంతర్గాములలో ఒకటి. ఇవి సాంప్రదాయ, అణు దాడులు రెండింటినీ చేయగలవు.
4. కొలంబియా-క్లాస్, అమెరికా
కొలంబియా-క్లాస్ జలాంతర్గామిని US నేవీ కోసం నిర్మిస్తున్నారు. ఇవి అత్యంత అధునాతన బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు. 12 జలాంతర్గాములను నిర్మించాలని ప్రణాళిక ఉంది. ఇవి 16 ట్రైడెంట్ II D5 LE బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగలవు. దీనిని ఒహియో-క్లాస్ జలాంతర్గాముల స్థానంలో రూపొందించారు. ఇది తదుపరి తరం స్టెల్త్ సాంకేతికతలను కలిగి ఉంది.
5. అరిహంత్ క్లాస్, భారతదేశం
భారతదేశం వద్ద రెండు అరిహంత్ శ్రేణికి చెందిన బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు ఉన్నాయి. ఇలాంటివి అనేక జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయి. ఇది 4 K-15 సాగరికా లేదా 4 K-4 బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగలదు. ఇది 12 K-15 SLBM లను కూడా కలిగి ఉంటుంది. ఇది భారతదేశం శక్తిని, దాడి చేసే సామర్థ్యాన్ని పెంచింది.
6. టైప్ 094 (జిన్-క్లాస్), చైనా
చైనా వద్ద టైప్ 094 (జిన్-క్లాస్) బాలిస్టిక్ క్షిపణి అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇవి పన్నెండు 16 JL-2 బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగలవు.
7. ట్రయంఫెంట్-క్లాస్, ఫ్రాన్స్
ఫ్రాన్స్ వద్ద ట్రయంఫెంట్-క్లాస్ అణు జలాంతర్గామి ఉంది. ఇది 16 M51 బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగలదు.
8. వాన్గార్డ్-క్లాస్, యునైటెడ్ కింగ్‌డమ్
యునైటెడ్ కింగ్‌డమ్ నేవీ వద్ద 4 వాన్గార్డ్-క్లాస్ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు ఉన్నాయి. ఇది 16 ట్రైడెంట్ II D5 బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగలదు.
9. బోరీ-క్లాస్, రష్యా
రష్యన్ నేవీ బోరీ-క్లాస్ జలాంతర్గాములను ఉపయోగిస్తుంది. ఇటువంటివి నాలుగు జలాంతర్గాములు ఉపయోగంలో ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇది 16 బులావా బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగలదు. ఈ జలాంతర్గాములు పాత డెల్టా, టైఫూన్ తరగతులను భర్తీ చేయడానికి రూపొందించారు.
10. ఒహియో-క్లాస్, అమెరికా
ఒహియో-క్లాస్ జలాంతర్గాములు అమెరికా వద్ద ఉన్నాయి. ఇవి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు. US నేవీ దాదాపు 14 జలాంతర్గాములను ఉపయోగిస్తోంది. ఇది 24 ట్రైడెంట్ II D5 బాలిస్టిక్ క్షిపణులను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇవి US నేవీలో అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు.