సూర్యనమస్కారం
డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలకు తొలగిపోవాలంటే క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారం అనేది జీవక్రియను పెంచే సాధనం. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమగ్రమైన యోగా శైలి.
బద్ధకోణాసనం
బద్ధకోణాసనం వేయడం వల్ల బొడ్డు వద్ద కొవ్వు తగ్గుతుంది. లోపలి తొడ భాగం బలంగా మారుతుంది. చలనశీలతను మెరుగుపడుతుంది. మీ కోర్‌ను బలోపేతం అవుతుంది. మీ సాధారణ వ్యాయామ దినచర్యకు ఈ సులభమైన శక్తివంతమైన యోగా భంగిమను జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
శీర్షాసనం
"యోగాసనాల రాజు" అని పిలువబడే శీర్షాసనం రక్త ప్రసరణ, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శీర్షాసనంలో ఎంత ఎక్కువ సేపు ఉండగలిగితే అన్ని ప్రయోజనాలు ఉంటాయి.
సర్వాంగసనం
సర్వాంగసనం అన్ని ఆసనాలకు రాణి అని చెబుతారు. కండరాలను బలోపేతం చేయడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. కండరాలను సాగదీయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ భంగిమ దీర్ఘకాలిక నిద్రలేమికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగు పడటానికి కూడా సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శవాసనం
ప్రతి యోగా సాధన శవాసనంతో ముగుస్తుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. క్రమం తప్పకుండా శవాసనం సాధన చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. సాధారణ అలసట, తలనొప్పి సులభంగా మాయమైపోతుంది.