పౌర్ణమి, అమావాస్యకు కూడా ఇలా..
ప్రకృతి నిబంధనల ప్రకారం ప్రతి పౌర్ణమి, అమావాస్యకు సముద్రం ముందుకు, వెనక్కు వెళ్లడం సహజమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడు, చంద్రుడు ఆకర్షణల వల్ల ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు ఇలా జరుగుతుంది. అమావాస్య, పౌర్ణమికి వచ్చే కెరటాలను స్ప్రింగ్ టైడ్స్ అంటారు. ఆ సమయంలో సుమారు 6 అడుగుల వరకు సముద్రం వెనక్కు వెళుతుందట. అయితే మళ్లీ మరుసటి రోజే సముద్రం సాధారణంగా మారిపోతుంది. అయితే ఇలా రాళ్లు బయట పడేంతలా వెనక్కు వెళ్లడం చాలా అరుదు.
పౌర్ణమి కూడా ఓ కారణమే..
పౌర్ణమి దగ్గరలో ఉండటంతో ఈ విధంగా సముద్రం వెనక్కు వెళ్లింది. అయితే 6 అడుగులకు పైగా వెళ్లడం వెనుక ఇతర కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి సునామీ. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం సునామీ వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు.