భారతదేశంలో అత్యధిక జీతం ఇచ్చే టాప్-10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో తెలుసా?

First Published | Nov 14, 2024, 10:01 AM IST

Top 10 Highest Paying Government Jobs in India : ప్రభుత్వ ఉద్యోగాలు భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైనవిగా, మంచి జీతాలు, ఇతర ప్రయోజనాలు ఉండేవి కావడంతో మస్తు క్రేజ్ ఉంది. అయితే, మన దేశంలో అత్యధిక జీతం అందించే టాప్ 10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో మీకు తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగాలు-హై సాలరీ

ఉద్యోగ భద్రత, ప్రతిఫలాలు, మంచి జీతం వంటి కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగం పాందడం చాలా మంది భారతీయ యువత లక్ష్యంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలు సామాజిక గౌరవాన్ని కూడా అందిస్తాయి, ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగాల కంటే వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రయివేటు రంగంతో పోటీ పడుతూ ప్రభుత్వ ఉద్యోగులు భారీ సాలరీలు అందుకుంటున్న ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. భారతదేశంలో అలాంటి అత్యధిక జీతం అందించే ప్రభుత్వ ఉద్యోగాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగాలు-హై సాలరీ

IAS అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,50,000 వరకు జీతం అందుకుంటారు. వారు ప్రభుత్వానికి విధానాలను రూపొందించి అమలు చేస్తారు. వివిధ ప్రభుత్వ విభాగాలలో వారు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తారు, దేశ అభివృద్ధికి దోహదపడతారు. దేశంలో అత్యంత పలుకుబడి, గౌరవం లభించే ప్రభుత్వ ఉద్యోగులలో ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారు. 

అలాగే, IPS అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,25,000 వరకు సంపాదిస్తారు. వారి ప్రధాన పాత్ర చట్టం అమలులో పాత్ర వహించడం, శాంతి భద్రతలను కాపాడుతూ.. నేరాలను తగ్గించడం. వారు పోలీస్ విభాగంలో పనిచేస్తారు. ప్రజల భద్రతకు బాధ్యత వహిస్తారు. దేశంలో శాంతియుత వాతావరణం కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తారు. 


ప్రభుత్వ ఉద్యోగాలు-వేతనాలు

IFS (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,50,000 వరకు సంపాదిస్తారు. వారు విదేశాలలో భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరిస్తారు, ఇతర దేశాలతో మంచి సంబంధాలను పెంపొందించుకుంటారు, దౌత్య సంక్షోభాలను నిర్వహిస్తారు. వారు అంతర్జాతీయంగా భారతదేశ ప్రయోజనాలను కాపాడుతారు. కాబట్టి వీరికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంటుంది. 

భారత వైమానిక దళం, సైన్యం, నౌకాదళం అధిపతులు నెలకు రూ.56,100 నుండి రూ.2,50,000 వరకు సంపాదిస్తారు. వారి ప్రధాన పాత్ర బాహ్య ముప్పుల నుండి దేశాన్ని రక్షించడం. సైనిక కార్యకలాపాలను నిర్వహించడం. వారు జాతీయ భద్రతకు బాధ్యత వహిస్తారు. దేశం సరిహద్దులలో గస్తీ కాస్తూ  ముప్పులను నివారిస్తుంటారు. శత్రుదేశాల దాడులను తిప్పికొడుతారు. అవసరమైనప్పుడు  ఇతర విభాగాలతో కలిసి దేశం కోసం పనిచేస్తారు. 

టాప్ సాలరీ ప్రభుత్వ ఉద్యోగాలు

ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) అధికారులు నెలకు రూ.60,000 నుండి రూ.2,80,000 వరకు సంపాదిస్తారు. వారు ఇంధన, ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పనిచేస్తారు, దేశ పురోగతికి దోహదపడతారు. 

IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,25,000 వరకు సంపాదిస్తారు. వారు పన్నులను వసూలు చేస్తారు. పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూస్తారు, జాతీయ అభివృద్ధికి ఆర్థిక వనరులను అందిస్తారు. భారత అర్థిక రంగం నిర్వహణలో వీరిది కీలక పాత్ర ఉంటుంది. 

ప్రభుత్వ ఉద్యోగాలు

భారతీయ రైల్వే సర్వీస్ అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,25,000 వరకు సంపాదిస్తారు. వారు రైల్వే కార్యకలాపాలను నిర్వహిస్తారు, ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తారు. రైల్వే వ్యవస్థ సజావుగా పనిచేసేలా చూస్తారు. భారత్ లో రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి దేశ పురోగతిలో వీరి బాధ్యతలు చాలా కీలకంగా ఉన్నాయి. 

IAAS (ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్) అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,25,000 వరకు సంపాదిస్తారు. వారు సరైన ప్రభుత్వ వ్యయం నిర్ధారిస్తారు. ప్రజా నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాలు

రాష్ట్ర ప్రజా సేవా కమిషన్ అధికారులు నెలకు రూ.56,100 నుండి రూ.2,25,000 వరకు సంపాదిస్తారు. వారు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో పరిపాలనా పాత్రలను నిర్వహిస్తారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల సరైన అమలును నిర్ధారిస్తారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నెలకు రూ.2,50,000 వేతనం అందుకుంటారు. హైకోర్టు న్యాయమూర్తులు రూ.2,24,000 వేతనం అందుకుంటారు. వారు న్యాయ ప్రక్రియలకు నాయకత్వం వహిస్తారు, వాదనలను వింటారు.. తీర్పులను ఇస్తారు, దేశ చట్టాన్ని నిలబెడతారు. వేతనంతో పాటు వీరికి అనేక ప్రత్యేక సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. 

Latest Videos

click me!