మీ దంతాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉండాలంటే వీటిని మిస్ చేయకండి

First Published | Nov 3, 2022, 4:54 PM IST

నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే.. దంత క్షయం, చిగుళ్ల నొప్పి వంటి ఎన్నో నోటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలు పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను తప్పకుండా తినాలి. 

శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే దంత సంరక్షణ చాలా అవసరం. నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు వంటివి వస్తాయి. అంతేకాదు నోట్లో పేరుకుపోయిన బ్యాక్టిరియా.. ఇతర సూక్ష్మజీవులు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలా జరగకూడదంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను కూడా తినాలి. అప్పుడే మీ దంతాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటాయి. అవేంటో  ఇప్పుడు తెలుసుకుందాం..
 

పాలు, పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. పాలు, జున్ను, పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది పంటి ఎనామిల్ ను సంరక్షిస్తుంది. పంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పాల ఉత్పత్తుల్లోని పోషకాలు బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే కొన్ని ఆమ్లాలను తగ్గిస్తాయి. మొత్తంలో పాల ఉత్పత్తులు మన దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 


నీళ్లను ఎక్కువగా తాగాలి

మన శరీరానికి పోషకాహారంతో పాటుగా నీళ్లు కూడా అవసరమే. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగితే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీ నోట్లో లాలాజలం పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహారా పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. 
 

ఆపిల్

రోజుకో ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదన్న ముచ్చట అందరికీ తెలుసు.. ఆపిల్స్ తింటే మీ దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా దంతక్షయం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. పళ్లలో కుహరం ఏర్పడకుండా నిరోధించడానికి ఆపిల్స్ ఉపయోగపడతాయి. ఈ పండ్లను నమిలి తినడం వల్ల దంతాలకు అంటుకుని ఉన్న బ్యాక్టీరియాను తొలగిపోతుంది. 
 

విటమిన్ సి

విటమిన్ సి సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు కూడా దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే నారింజ, నిమ్మకాయలు, పైనాపిల్స్, టమోటాలు, దోసకాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఇవి దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
 

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీల్లో ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే స్ట్రాబెర్రీలు దంత ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే దంతాలను తెల్లగా మెరిపించేందుకు కూడా సహాయపడతాయి. 
 

విటమిన్ డి 

విటమిన్ డి ఎముకలను, దంతాలను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు  ఈ విటమిన్ దంతక్షయాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎనామిల్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సాల్మాన్ చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం దంతాల సమస్యలు రాకుండా చేస్తుంది. 
 

ఆకు కూరలు

ఆకు కూరలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా బచ్చలికూర, బ్రోకలీ, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలకు ఏ లోటూ ఉండదు. వీటిలో ఉండే విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 

Latest Videos

click me!