ఈ టెక్నిక్స్ కూడా వాడొచ్చు..
5. తియ్యటి పదార్థాలు.. కారంగా లేదా మసాలా ఎక్కువ ఉన్న కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిటికెడు పంచదార లేదా కొన్ని చుక్కల తేనె కలపవచ్చు. ఇది స్వీట్‌నెస్‌ను ఇవ్వడంతో పాటు ఉప్పు, కారాల సమతుల్యతను .. పెంచుతుంది.
మరి గ్రేవీ కర్రీ కాకుండా.. ఫ్ర కర్రీ అయితే…
గ్రేవీ కర్రీ కాకుండా డ్రై ఫ్రైలు (ఉదాహరణకు బెండకాయ, ఆలూ ఫ్రై) లో ఉప్పు ఎక్కువైతే, మరికొన్ని కూరగాయ ముక్కలు లేదా ఉడికించిన పప్పు, కొబ్బరి తురుము వంటివి అదనంగా చేర్చి వండండి. దీనివల్ల మోతాదు పెరిగి ఉప్పు సరిపోతుంది.
7. కొబ్బరి పాలు … నాన్-వెజ్ గ్రేవీలలో ఉప్పు ఎక్కువైతే చిక్కటి కొబ్బరి పాలు కలపండి. ఇది ఉప్పును తగ్గించి, కూరకు మంచి రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది.
8. టమోటా ప్యూరీ… పచ్చి టమోటాల ప్యూరీ లేదా కొద్దిగా టమోటా సాస్ కలపడం వల్ల అందులోని సహజ సిద్ధమైన పులుపు, తియ్యదనం ఉప్పు ఘాటును తగ్గించడంలో సహాయపడతాయి.
9. ఉడికించిన అన్నం.. ఆలూ లేదా పిండి అందుబాటులో లేకపోతే, మెత్తగా ఉడికించిన అన్నాన్ని చిన్న ముద్దగా చేసి కాటన్ గుడ్డలో కట్టి లేదా నేరుగా గ్రేవీలో వేసి 5 నిమిషాలు మరిగించి తీసివేయండి. ఇది ఉప్పును సులభంగా పీల్చుకుంటుంది.
ఈసారి మీ ఇంట్లో కూరల్లో ఉప్పు ఎక్కువైతే కంగారు పడకుండా మీ వద్ద ఉన్న పదార్థాన్ని బట్టి ఈ హ్యాక్స్ ట్రై చేయండి..