1. ముందుగా గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి, మసాలా లోపలికి వెళ్లేలా చిన్న గాట్లు పెట్టాలి.
2. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాక, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.
3. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి మెత్తని ప్యూరీలా రుబ్బుకోవాలి.
4. ఇప్పుడు మరొక పాన్‌లో నూనె వేసి గాట్లు పెట్టిన గుడ్లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
5. అదే నూనెలో మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.
6. ముందుగా చేసుకున్న టమాటా-ఉల్లిపాయ ప్యూరీని వేసి కలపాలి. అందులోనే ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేథి వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
7. చివరగా వేయించిన గుడ్లను గ్రేవీలో వేసి మూతపెట్టి 5 నుంచి 7 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.
8. చివర్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చిక్కటి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ సిద్ధమవుతుంది.