Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్

Published : Aug 31, 2026, 06:44 PM IST

Dosa: డయాబెటిస్ ఉన్నవారు ఏది పడితే అది తినకూడదు. దోశెలు కూడా ఆరోగ్యంగా వారి కోసం స్పెషల్ గా తయారుచేసుకోవాలి. మేము ఇక్కడ ఆరోగ్యకర పద్ధతిలో దోశె తయారీ ఇచ్చాము. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది.

PREV
13
డయాబెటిస్ ఉన్న వారి కోసం స్పెషల్ దోశె

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. . ముఖ్యంగా ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే టిఫిన్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయేమోనని చాలామంది ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలో, దోశను ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. ఇది చాలా సులువు. దోశెకు గుడ్డు జోడించడం వల్ల ప్రోటీన్ పెరిగి, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎగ్ దోశ తింటే షుగర్ లెవల్స్ పెరగవని గ్యారెంటీ లేదు. దోశ పిండి, తినే దోశల సంఖ్య, మీ ఆరోగ్యంపైనే బ్లడ్ షుగర్ ప్రభావం ఆధారపడి ఉంటుంది.

23
ఎగ్ దోశ ఎందుకు మంచి ఆప్షన్?

గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కేవలం కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం కన్నా, ప్రోటీన్ కలిపిన ఆహారం తిన్నప్పుడు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మధ్యమధ్యలో చిరుతిళ్లు తినే అలవాటు తగ్గే అవకాశం ఉంది. దోశలోని కార్బోహైడ్రేట్లకు గుడ్డులోని ప్రోటీన్ తోడైతే, అది ఒక బ్యాలెన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. అయితే గుడ్డుతో పాటూ ఇతర కూరగాయలు కూడా జోడిస్తే ఇంకా మంచిది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వంటివి బాగా వేసుకుని మంచిది

33
ఇలా తింటే ఇంకా మంచిది

దోశెలు రెండుకు మించి తినకండి. ఉల్లిపాయ, టమాటా, పాలకూర, క్యాప్సికమ్ వంటి కూరగాయలు కలిపితే ఫైబర్ లభిస్తుంది. ఎక్కువ నూనె లేదా బటర్ తో కాకుండా, తక్కువ నూనెతో దోశ వేసుకోవడం మంచిది.

తెల్ల బియ్యం ఎక్కువగా వాడిన దోశ పిండి కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచొచ్చు. అందుకే, డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో చిరుధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే పిండి రకాలను ఎంచుకోవచ్చు. చట్నీ కూడా ముఖ్యమే! కొబ్బరి చట్నీని మితంగా తీసుకోవచ్చు. కానీ, చక్కెర కలిపిన చట్నీలు, ఎక్కువ కార్బ్స్ ఉండే సైడ్ డిష్‌లకు దూరంగా ఉండటం మంచిది. కూరగాయల సాంబార్ తీసుకుంటే అదనపు ఫైబర్ అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories