నెయ్యిని నిల్వ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు అది త్వరగా పాడయ్యేలా చేస్తుంది. నెయ్యి వాడాక చాలామంది మూతను వదులుగా పెడతారు. దీనివల్ల గాలి, తేమ లోపలికి వెళ్లి నెయ్యి తాజాదనం, సువాసన తగ్గిపోతాయి. అలాగే, తడి లేదా వాడిన స్పూన్‌తో నెయ్యి తీస్తే అది త్వరగా పాడవుతుంది. ఎప్పుడూ పొడి, శుభ్రమైన స్పూన్ మాత్రమే వాడాలి.
వంటకు సులభంగా ఉంటుందని చాలామంది స్టవ్ దగ్గరే నెయ్యి డబ్బా పెడతారు. కానీ ఆ వేడికి నెయ్యి రుచి, వాసన పాడవుతాయి. నెయ్యిని ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టాలి. కిటికీ దగ్గర లేదా నేరుగా ఎండ తగిలే చోట పెట్టినా నెయ్యి నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది.