వీటి కారణంగా బీపీ, క్యాన్సర్, ఊబకాయం, డిప్రెషన్, ఒత్తిడి వంటి దీర్ఘకాలిక సమస్యలు (Chronic problems) తలెత్తుతాయి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని టీవీ, ఫోన్ చూస్తూ స్నాక్స్ ఐటమ్స్ (Snacks Items) ను ఎక్కువగా తీసుకుంటుంటారు. వాటిలోని సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు కారణంగా శరీరంలో ఇన్ఫ్లమెషన్ పెరుగుతుంది. దీంతో వయసు త్వరగా మీద పడి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి.