అకాయ్ బెర్రీలతో... వృద్ధాప్యానికి చెక్....

First Published | Aug 19, 2021, 12:57 PM IST

అకాయ్ బెర్రీ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి లోతైన పోషణనిస్తాయి. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, ఈ లు అధికంగా ఉంటాయి. 

acai berry

అకాయ్ బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మసంరక్షణలో దీన్ని చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాలుష్యం నుంచి కాపాడతాయి. యాంటీ ఏజింగ్  ఏజెంట్ గా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వీటిలో నీటి శాతం కూడా అదికంగా ఉంటుంది. దీనివల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. నిగారింపుతో మెరిసిపోతుంది. సహజ చర్మ సంరక్షణలో బాగా తోడ్పడుతుంది కాబట్టి దీన్ని సూపర్‌ఫుడ్‌ అని కూడా అంటారు.

acai berry

అకాయ్ బెర్రీ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి లోతైన పోషణనిస్తాయి. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, ఈ లు అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఒమేగా -3, -6, -9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చర్మం ఇరిటేషన్, ఇబ్బందిని తొలగించి... చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. 

Latest Videos

చర్మానికి అకాయ్ బెర్రి ఎన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తుందంటే.. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల.. చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్‌ లు అధిక సాంద్రతతో కూడి ఉంటాయి. అకాయి బెర్రీ కాలుష్యం, ఒత్తిడి, ఇతర హానికరమైన పర్యావరణ కారకాల వల్ల ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్‌తో అత్యంత ప్రభావవంతంగా పోరాడుతుంది. అకాయ్ బెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలోకి పోషకాలు శోషించుకునే సామర్థ్యం పెరిగేలా దోహదపడతాయి. 

వయసు పెరగడం వల్ల చర్మం మీద ఏర్పడే గీతలు, ముడతలు రాకుండా కాపాడుతుంది. అప్పటికే వచ్చి ఉంటే.. వాటిని తగ్గించడంలో సాయపడుతుంది. చర్మ కణాలు పునరుత్పత్తి కావడానికి దోహదపడుతుంది. చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. 

వయస్సు పెరిగే కొద్దీ, చర్మం లోని ఎపిడెర్మల్ పొర బలహీనంగా మారి, తేమను కోల్పోయే అవకాశం ఉండడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్న అకాయి బెర్రీలు అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. కొల్లాజెన్ చర్మం బిల్డింగ్ బ్లాక్‌గా పిలువబడుతుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అకాయి బెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

అకాయ్ బెర్రీలలో మెగ్నీషియం కూడా ఉంటుంది, ఇది చర్మ కణాల పునరుత్పత్తిని నియంత్రిస్తుంది. చర్మాన్ని బాగు చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న అకాయ్ బెర్రీ మొటిమలు, బ్రేక్‌అవుట్‌లను ఎదుర్కోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అకాయ్ బెర్రీలో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చర్మాన్ని మృధువుగా, మెరిసేలా చేస్తుంది. 

click me!