ఈ పనులు చేసినా.. మందును చాలా తగ్గిస్తారు

First Published | Nov 11, 2024, 4:23 PM IST

మందుకు బానిసలైన వారు చాలా మందే ఉన్నారు. నిజానికి మందు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల లేనిపోని జబ్బులు వస్తాయి. అయితే మందును మానేద్దామని మానలేకపోతున్నవారు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి వారికి రెండు చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. 

మందు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రమాదకరమైన జబ్బులు వస్తాయన్న సంగతి దీన్ని తాగే వారికి కూడా తెలుసు. అయినా మందును తాగకుండా వీళ్లు అస్సలు ఉండలేరు.

కొంతమంది మందును రోజూ తాగితే.. మరికొంతమంది మాత్రం పండుగలకు, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు మాత్రమే తాగుతుంటారు. కొంతమంది తాగడం మొదలుపెడితే ఎంతకీ ఆపరు. ఇలాంటి వారే మందుకు బానిసలవుతారు. 

మీకు తెలుసా? మీ శరీరం ఒక గంటలో ఒక్క పెగ్గును మాత్రమే జీర్ణం చేసుకోగలదు. నిపుణుల ప్రకారం.. రోజుకి మూడు పెగ్గులను మాత్రమే తాగాలి. ఇంతకన్నా ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కానీ మందు తాగేవాళ్లకు ఇవేం పట్టవు. అలాగే ఎన్ని పెగ్గులైనా తాగుతుంటారు. కానీ మందును తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాని సైడ్ ఎఫెక్ట్స్ మీపై కనిపించడం మొదలుపెడతాయి. ఇవి కొంతమందికి వెంటనే కనిపిస్తాయి. మరికొందరికి కొంతసేపటి తర్వాత కనిపిస్తుంటాయి. 

Latest Videos


మద్యం తగ్గించడం ఎలా?

మందు తాగడం ఎలా తగ్గించాలి? 

మందును ఎంత తాగినా ప్రమాదమేనంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది లిమిట్ లో తాగితే.. మరికొంతమంది ఎక్కువగా తాగుతుంటారు. మందుకు బానిసలైనవారు మందును తాగడం ఎలా ఆపాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఎంత మందు తాగొచ్చు 

ఈ రోజుల్లో ఏ చిన్న పండక్కి అయినా.. మందును ఏర్పాటు చేయడం, తాగడం కామన్ అయిపోయింది. కొన్ని కొన్నిసార్లైతే మితిమీరి తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెద్దవారు వారానికి 10 గ్లాసుల కన్నా ఎక్కువ మందును తాగకూడదు. అంటే రోజుకి నాలుగు గ్లాసుల కన్నా ఎక్కువగా తాగకూడదు. 330 ml బీర్, 30 ml విస్కీ, 150 ml వైన్ లాంటివి మాత్రమే తాగాలి.

ఒక గంటకు ఎంత మందు తాగొచ్చు?

మందును ఎక్కువ తాగితే మీ రక్తంలో ఆల్కహాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి ఇలా జరగకూడదంటే  మీరు గంటకి ఒక గ్లాసు మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మించి తాగితే మాత్రం మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

మీరు రోజూ మందును ఎక్కువగా తాగితే ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు, హ్యాంగోవర్ వస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్, గుండె, లివర్, ప్యాంక్రియాస్, మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఖాళీ కడుపుతో మద్యం తాగకూడదు

మీరు ప్రతిసారి తాగిన మందు నేరుగా మీ కడుపు, చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోకి వెళుతుంది. మీరు గనుక ఖాళీ కడుపున మందును తాగితే అది వేగంగా మీ రక్తంలోకి వెళ్లి మీకు సమస్యలు వచ్చేలా చేస్తుంది. అందుకే మందును తాగడానికి ముందు ఏదైనా తినండి. అలాగే నీళ్లను ఎక్కువగా తాగండి. సాల్ట్ స్నాక్స్ ను తినకండి. మందులోకి మీరు సలాడ్, నట్స్, వేరుశనగలు, పనీర్ లాంటివి తినొచ్చు.

తాగి డ్రైవింగ్ చేయకండి

తాగి డ్రైవింగ్ చేయకండి

చాలా మంది తాగి డ్రైవింగ్ చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇది కేవలం మీకే కాదు మీ చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదకరమే. మందు కొంచెం తాగినా డ్రైవింగ్ కు దూరంగా ఉండండి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక్క మీకే కాదు ఇతరులకు కూడా ఇది ప్రమాదకరం. 

తాగి పందాలు కాయకండి

కొందరు తాగేటప్పుడు పందాలు కాస్తుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఒకేసారి బాటిల్ ఖాళీ చేస్తాను, ఎవరు ముందు ఖాళీ చేస్తారో, ఎవరు మందు ఎక్కువగా తాగుతారు లాంటి పందాలు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి పందాలకు దూరంగా ఉండటమే మీ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్‌తో మందును అస్సలు కలపండి. ఇది మిమ్మల్ని ఎక్కువ తాగేలా చేస్తుంది. 

click me!