శరీర పరిశుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేయడం అవసరం. స్నానం చేయడం వల్ల ఒంటికి అంటుకున్న మురికి, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్ లు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. నిపుణుల ప్రకారం.. రోజువారి స్నానం మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే మనలో చాలా మంది కాలానుగునంగా, ఆరోగ్య పరంగా వేడి నీళ్లు, చల్ల నీళ్లతో స్నానం చేస్తుంటాం.
కొంతమంది అయితే ఏ సీజన్ అయినా వేడి లేదా చల్ల నీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే చలికాలంలో చన్నీటి స్నానం చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇది సాహసమనే చెప్పాలి. చలికాలంలో చన్నీటి స్నానమంటే గజగజా వణికిపోయేవారున్నారు. కానీ పురాతన గ్రీకులు, రష్యన్ల నుంచి ప్రస్తుత అథ్లెట్లు, సెలబ్రిటీలు మాత్రం చలికాలంలో కూడా చన్నీటి స్నానాలే చేస్తారు. అసలు చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
చలికాలంలో చన్నీటి స్నానమంటే భయపడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఈ సీజన్ లో కూడా మీరు చన్నీటితో స్నానం చేస్తే బోలెడు లాభాలు పొందుతారు. అందులో ఒకటి మెరుగైన రక్తప్రసరణ. అవును చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే మీ శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల మీశరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రవాహం పెరిగి అవి బాగా పనిచేస్తాయి.
bath
చురుకుదనం
మీరు రోజూ ఉదయాన్నే చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల మీ చర్మానికి విశ్రాంతి కలుగుతుతుంది. అలాగే మీ శ్వాస వేగం కూడాపెరుగుతుంది. దీనివల్ లమీ శరీరం ఆక్సిజన్ ను మరింత ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడుతుంది. దీనితో మనం చురుగ్గా ఉంటాం.
ఇమ్యూనిటీ
చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఒంట్లో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక కణాల కార్యాచరణ పెరుగుతుంది. అంటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇది చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం
వేడి నీళ్ల కంటే చల్ల నీళ్లతో స్నానం చేస్తేనే మీ జుట్టు నుంచి అదనపు నూనె, దుమ్ము, ధూళి తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే కూల్ వాటర్ చలికాలంలో మీ చర్మం పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
కండరాల నొప్పి నుంచి ఉపశమనం
కండరాల నొప్పులు ఉన్నవారు చలికాలంలో చన్నీటి స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే చల్ల నీళ్లు కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల మీ కండరాలు రిలాక్స్ అయ్యి కండరాల నొప్పి తగ్గుతుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
చల్ల నీళ్లు మన మానసిక స్థితిని మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి. కూల్ వాటర్ మన శరీరంలో డోపామైన్, సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు తగ్గిపోతాయి. ఇది మీకు మంచి రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.
ఇవి గుర్తుంచుకోండి
చల్ల నీళ్ల స్నానం మీ శరీరంలో రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. కాబట్టి చల్ల నీటిని శరీరంపై పోయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చల్ల నీళ్లను నేరుగా తలపై పోయకుండా.. ముందుగా పాదాల నుంచి శరీరాన్ని చల్ల నీళ్లతో తడపడం స్టార్ట్ చేయాలి. ఇకపోతే దగ్గు, జ్వరం, జలుబు, గుండెజబ్బులు, హబీపీ సమస్యలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితిలో చల్ల నీళ్లతో స్నానం చేయకూడదు.