Health Tips: శరీరంలో వేడి కారణంగా ముఖంపై మొటిమలు అవుతున్నాయా..? అయితే ఇలా చేయండి..

Published : Apr 07, 2022, 03:37 PM IST

Health Tips:ఒంట్లో వేడి ఎక్కువైనా మొటిమలు పుట్టుకొస్తుంటాయి. ఈ వేడి పింపుల్స్ నుదురు, బుగ్గలపై వస్తుంటాయి. వీటిని అంత సులభంగా వదిలించుకోలేము. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

PREV
17
Health Tips: శరీరంలో వేడి కారణంగా ముఖంపై మొటిమలు అవుతున్నాయా..? అయితే ఇలా చేయండి..

Health Tips: ఒంట్లో వేడి పెరిగితే కూడా ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. వీటినే వేడి మొటిమలు అంటుంటారు. ఈ మొటిమలు ఎక్కువగా ముఖంపై నుదురు, బుగ్గల భాగంలో వస్తుంటాయి. వీటిని అంత సులువుగా వదిలించుకోలేమని నిపుణులు అంటున్నారు. 

27
Acne_problem

ముఖాన్ని సరిగ్గా కడగకపోయినా, మంచి ఆహారం తీసుకోకపోయినా, ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకున్నా, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. వీటిని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. 

37

అయితే ఈ పింపుల్స్ Microbial infection వల్ల వస్తుంటాయట. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేడి మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.

47

తేనె.. ముఖానికి తేనెను రాయడం వల్ల ముఖం మొటిమల నొప్పి తగ్గడంతో పాటుగా ముఖం చల్లగా అవుతుంది. అంతేకాదు మొటిమలను పుట్టించే బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తుంది. ఇందుకోసం.. ఒక పెద్ద స్పూన్ తేనెను తీసుకోండి. అందులో కొన్ని పచ్చి పాలను పోసి బాగా మిక్స్ చేయండి. ఆ మిశ్రమాన్ని మొటిమలకు రాసి .. కొద్దిసేపటి తర్వాత నీట్ గా కడగండి. 

57

పసుపు.. పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. మొటిమలను తొలగించడానికి పసుపు మంచి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. పసుపును ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమల మంట తగ్గుతుంది కూడా. ఇందుకోసం పసుపును కొద్దిగా తీసుకుని అందులో కాస్త పెరుగు వేసుకుని మొటిమలకు పట్టించాలి. అది బాగా ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగండి. 

67

నిమ్మకాయ.. నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంత మేలుచేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఈ నిమ్మకాయ  మొటిమలను తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా అవసరం. దీనివల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మొటిమలు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం తీసుకుని అందులో తేనెను కొన్ని చుక్కలు వేయాలి. దాన్ని బాగా కలిపి మొటిమలకు పట్టించాలి. ఐదారు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడిగితే చక్కటి ఫలితం ఉంటుంది. 

77

అలొవెరా జెల్.. కలబంద జుట్టు, చర్మ సంరక్షణకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఇన్ఫెక్షన్ సమస్యను కూడా వదిలిస్తుంది. వేడి మొటిమలు అయిన వారికి ఇది చక్కటి మెడిసిన్ అనే చెప్పాలి. రోజుకు రెండు మూడు సార్లు వేడి మొటిమలపై అలొవెరా జెల్ ను రాస్తే కొన్ని రోజుల్లోనే ఇవి వదిలిపోతాయి. 

 

Read more Photos on
click me!

Recommended Stories