డయాబెటీస్.. మధుమేహం కేవలం ఒక అనారోగ్య సమస్యే కాదు. ఇది నియంత్రణలో లేకపోతే మరెన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోకపోతే మాత్రం కంటి శుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, మాక్యులెర్ ఎడేమా, అంధత్వం వంటి కంటికి సంబంధించిన సమస్యలు చుట్టుకుంటాయి. మధుమేహులకు వారి కంటిచూపులో కొంచెం తేడా కొట్టినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఈ అంధత్వం సమస్య 18 నుంచి 64 ఏండ్ల లోపు వారికే వస్తుందని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు.