ఎసిడిటీ, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు

Published : Jul 23, 2022, 04:03 PM IST

ఎసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది రకరకాల మందులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి తాత్కాలికంగానే ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.   

PREV
110
ఎసిడిటీ, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు

ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు లేని వారు దాదాపుగా ఎవరూ లేరేమో. కాగా కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంథులు అవసరమైన దానికికంటే ఎక్కువ మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తే ఎసిడిటీ సమస్య వస్తుంది. ఈ అమ్లం ఆహారం జీర్ణం అయ్యేందుకు అవసరం అవుతుంది. 

210

ఎసిడిటీ వల్ల గుండెల్లో మంట పుడుతుంది. ఛాతిలో కొద్దిగా నొప్పి కూడా మొదలవుతుంది.  ఎసిడిటీ వల్ల అంతర్గత సిస్టమ్ దెబ్బతింటుంది. అంతేకాదు చాలా రోజుల వరకు మీరు నిరసంగానే ఉంటారు. అస్వస్థత బారిన కూడా పడతారు. ఇవి మీ రోజువారి పనులకు అడ్డంకులుగా మారుతాయి. 

310

ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది, గుండెలో మంట, ఎక్కిళ్లు, తరచుగా బర్పింగ్, అజీర్థి వంటివి ఎసిడిటీ లక్షణాలు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఎసిడిటీ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

410
fiber

ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినండి. ఎందుకంటే ఈ ఆహారాలు చాలా లేటుగా జీర్ణం అవుతాయి. దీంతో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఫైబర్ ఫుడ్ ను తక్కువగా తినండి. 

510

ఎసిడిటీ సమస్యను ఫేస్ చేస్తున్నవాళ్లకు కొన్ని రకాల ఆహారాలు సూపర్ ఫుడ్ తో సమానం.  సబ్జా గింజలు, కొబ్బరి నీరు వీరి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.ఈ రెండు ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  మంచి ప్రయోజనం చేకూరుతుంది. 

610

ఎసిడిటీ ని కెఫిన్ మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే కెఫిన్ కు వీలైనంత దూరంగా ఉండండి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

710

ముడి ఆహారాలను తీసుకోవడం మానేయండి. ఇది కూడా ఎసిడిటీని మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే ఏ ఆహారాన్నైనా బాగా వండిన తర్వాతే తినండి. లేకపోతే మీ సమస్య మరింత పెద్దది అవుతుంది. 
 

810

నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి: ఆహారాన్ని ఎంత నెమ్మదిగా, నమిలి తింటే అంత  మంచిది. ఏదో తరుముతున్నట్టు హడావుడిగా తింటే తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల గొంతు, గుండెల్లో మంట కలుగుతుంది. గ్యాస్ సమస్య కూడా తలెత్తుతుంది. 
 

910

అతిగా తినొద్దు: అతిగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కావాలంటే మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు తినండి. ఏమీ కాదు. ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినడం వల్ల శారీరక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ అలవాటు వల్ల గొంతు, ఛాతీలో దురదతో పాటు గురక వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఎక్కువ మొత్తంలో తినే అలవాటును మానుకోవాలి. 

1010

ప్రతిరోజూ 8 గంటల నిద్ర :  నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా, కంటి నిండ నిద్రలేకపోయినా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు రావు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories