బంగారు నగలు మెరుపు పోకుండా.. ధగధగలాడాలంటే.. ఇవి ట్రై చేయండి..

Published : Jul 15, 2021, 02:29 PM IST

బంగారం, వజ్రాలు, ప్లాటినమ్ నగలు చేయించినప్పుడు లేదా కొన్నప్పుడు ఉన్న మెరుగు రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోయి డల్ గా అవుతాయి. దీనికి మారుతున్న వాతావరణ పరిస్థితులతో పాటు..ఆభరణాలు పెట్టుకున్నప్పుడు మనం వాడే పెర్ఫ్యూమ్‌లు, సబ్బుల్లోని రసాయనాలు కూడా కారణమవుతాయి. 

PREV
113
బంగారు నగలు మెరుపు పోకుండా.. ధగధగలాడాలంటే.. ఇవి ట్రై చేయండి..

ఆభరణాలు మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా, అందంగా కనిపించేలా చేస్తాయి. మీ స్టేటస్ ను తెలిపే ముఖ్యమైన వాటిల్లో ఆభరణాలూ ఒకటి. 

213

అయితే బంగారం, వజ్రాలు, ప్లాటినమ్ నగలు చేయించినప్పుడు లేదా కొన్నప్పుడు ఉన్న మెరుగు రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోయి డల్ గా అవుతాయి. దీనికి మారుతున్న వాతావరణ పరిస్థితులతో పాటు..ఆభరణాలు పెట్టుకున్నప్పుడు మనం వాడే పెర్ఫ్యూమ్‌లు, సబ్బుల్లోని రసాయనాలు కూడా కారణమవుతాయి. 

313

అన్నిరకాల నగలు ఒకేదగ్గర భద్రపరచడం కూడా వాటిమీద గీతలు, మరకలు పడడానిక కారణమవుతాయి. ఇక డైమండ్స్ విషయానికి వస్తే అధిక వేడి, సూర్యకిరణాలు కూడా వాటిని డల్ గా చేస్తాయి. 

413

ఇక రాళ్ల నగల్లో నీరు దిగి వాటి సహజమెరుపును కోల్పోతాయి. దీంతో ఏదైనా శుభకార్యానికి వెళ్లేప్పుడు పెట్టుకుందామని చూస్తే అవి డల్ గా ఉండి.. మీ అందానికి దెబ్బ వేస్తాయి.

513

మరెలా... మీ నగలను కొత్తవాటిలా మెరుస్తూ ఉండేలా చేయడం ఎలా అంటే.. కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెబుతున్నారు ఆభరణాల నిపుణులు.

613

బంగారు ఆభరణాలను ప్రతి సంవత్సరం మీకు నమ్మకమైన ఆభరణాల తయారీదారు వద్ద శుభ్రం చేయించాలి. వారికైతే ఏ రాళ్లను ఎలా కడగాలి.. ఎంత వరకు కడిగితే, శుభ్రం చేస్తే నగలు మెరిసిపోతాయో బాగా తెలిసి ఉంటుంది. 

713

ఇక వజ్రాల విషయానికి వచ్చేసరికి వీటిని.. తేలికపాటి సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. అయితే దీనికోసం డిటర్జెంట్లను వాడకూడదు. కాసేపటి తరువాత మృదువైన టూత్ బ్రష్ ను ఉపయోగించి రుద్ది కడగాలి. ఆపై మృదువైన శుభ్రమైన మెత్తటి క్లాత్ తో తడిపోయేలా తుడిచేయాలి. 

813

సాధారణంగా అందరూ చేసే మామూలు తప్పు ఏంటంటే.. రెండు వేర్వేరు రకాల ఆభరణాలను ఒకే పెట్టెలో పెట్టడం. దీనివల్ల ఒకదాంట్లో ఒకటి చిక్కుకుపోయి.. నగలు విరగడం లేదా రాళ్ల మెరుపు దెబ్బతినడం.. ఊడిపోవడం జరుగుతాయి. 

913

నగలను వేటికవే భద్రపరచండి. ఇప్పుడు మార్కెట్లో ఎయిర్ టైట్ పౌచ్ లు, బాక్సులు దొరుకుతున్నాయి. వీటిల్లో భద్రపరిస్తే తేమ చేరకుండా జాగ్రత్తగా ఉంటాయి. 

1013

ఇక ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లి వచ్చాక.. నగలు తీసి అలా డ్రాయర్లో పడేయకుండా.. అవి పొడిగా ఉన్నాయా... చెమటతో ఉన్నాయా గమనించాలి. అలా ఉంటే కాసేపు గాలికి ఆరిన తరువాత భద్రపరచాలి. 

1113

ఇక నగల డబ్బాల్లో సిలికా పౌచ్ లను వాడడం వల్ల అవి తేమను గ్రహించి రాళ్ల నగల మెరుపు పోకుండా కాపాడతాయి. యాంటీ టర్నిష్ పేపర్ వాడడం వల్ల కూడా నగల మెరుపును కాపాడవచ్చు.

1213

మీరు ప్రయాణాలు చేస్తున్నట్లైతే.. నగలను స్క్రాచ్ లు పడకుండా, డామేజ్ అవ్వకుండా కాపాడాలంటే.. వాటి బాక్సుల్లో ఎక్స్ ట్రా పాడింగ్ పెట్టాలి. 

1313

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ, నాణ్యతతో ఉంటాయి. 

click me!

Recommended Stories