ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా..? వాస్తు అవసరమే..!

First Published Jul 15, 2021, 12:51 PM IST

ఈ మొక్కలను పెంచే క్రమంలోనూ వాస్తు ఫాలో కావాల్సిందేనని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏ మొక్కని పెంచాలి..? ఏ దిక్కున పెట్టాలి..? లాంటివి కూడా చాలా ముఖ్యమట. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం.

ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇంట్లో మొక్కలు ఉంటే.. ఆ ఇల్లు నందనవనంలా అందంగా కనపడుతుంది. అయితే.. ఈ మొక్కలను పెంచే క్రమంలోనూ వాస్తు ఫాలో కావాల్సిందేనని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏ మొక్కని పెంచాలి..? ఏ దిక్కున పెట్టాలి..? లాంటివి కూడా చాలా ముఖ్యమట. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం.
undefined
1. తులసి మొక్క..తులసి మొక్కని హిందూ సంప్రదాయ ప్రకారం.. దేవతలా కొలుస్తారు. ఈ తులసి మొక్కను చాలా ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని నమ్ముతుంటారు. అయితే... ఇంటికి మంచి జరగాలని ఉంటే.. దక్షిణ దిక్కు కానీ.. తూర్పు దిక్కు గానీ.. పెట్టుకుంటే.. ఇంటికి మంచి జరుగుతుందట. రాత్రిపూట కూడా తులసి మొక్కని చీకట్లో వదిలేయకూడదట. చిన్న బల్బు కానీ.. దీపం కానీ ఉంచాలట. పూజ గదిలోనూ.. గార్డెన్ లోనూ పెంచుకోవాలి.
undefined
2. మల్లె మొక్క..ఇంట్లో మల్లె మొక్క పెంచుకుంటే.. ఆ సువాసలు ఇల్లంతా వ్యాపిస్తాయి. ఈ మొక్కని తూర్పు దిక్కుగా.. సూర్య రశ్మి తగిలేలా పెట్టాలి. అప్పుడు ఇంటికి మంచి జరుగుతుంది.
undefined
3.లిల్లీ..ఇండోర్ ప్లాంట్స్ గా పెట్టుకునేందుకు లిల్లీస్ బాగా సెట్ అవుతాయి. దీనికి ఎక్కువ సూర్య రశ్మి అవసరం లేదు. ఈ మొక్కని బెడ్రూమ్ లో పెట్టుకోవాలి. లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు బంధం మరింత బలపడుతుంది.
undefined
4.బోన్సాయి..చాలా మంది బోన్సాయి మొక్కలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ... వాస్తు ప్రకారం.. ఇవి అంత మంచిది కాదట. ప్రకృతి కి విరుద్దంగా జరిగేది ఏదీ.. వాస్తు విషయంలో మంచిది కాదట. బోన్సాయి మొక్కలను ప్రకృతి విరుద్దంగా.. పెద్దగా పెరగాల్సిన మొక్కలు కాస్త.. చిన్నగానే ఉండిపోతాయి. కాబట్టి.. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి.
undefined
click me!