నో వ్యాయామం, నో డైట్.. ఇవి పాటిస్తే.. నడుంచుట్టు కొవ్వు హాంఫట్...

First Published Aug 28, 2021, 4:33 PM IST

దీనికోసం కఠిన వ్యాయామాలు, డైట్ లు.. నియమాలు, నియంత్రణలు లాంటి అనేక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. కఠినమైన వ్యామాయాలు, డైట్ లో లేకుండానే నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. కాకపోతే దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

శరీరం మొత్తం బరువు పెరగడం ఓ ఎత్తైతే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం మరో ఎత్తు. దీన్ని తగ్గించడం అంత సులభం కాదు. నడుము చుట్టూ పేరుకుపోతే మొండి విసెరల్ కొవ్వు ఇది. ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఇది అస్సలు మంచిది కాదు. అయితే దీన్ని తగ్గించుకోవాలన్న పట్టుదల ఉంటే కాస్త కష్టమైనా అసాధ్యమేమీ కాదు. 

దీనికోసం కఠిన వ్యాయామాలు, డైట్ లు.. నియమాలు, నియంత్రణలు లాంటి అనేక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. కఠినమైన వ్యామాయాలు, డైట్ లో లేకుండానే నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. కాకపోతే దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

ఆహారంలో నియంత్రణ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కాకుండా.. తక్కువ మొత్తాలో ఎక్కువ సార్లు తినాలి. దీనివల్ల క్యాలరీల ఇంటేక్ తగ్గుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. 

తినేప్పుడు హడావుడిగా.. గబగబా తినడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారు. సరిగా పచనం కాకపోవడం వల్ల కొవ్వులు పేరుకుపోతాయి. అందుకే గబగబా తినడం తగ్గియ్యాలి. బాగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారంలోని అన్ని పోషకాలు సరిగా శరీరంలోకి శోషించబడతాయి. జీర్ణక్రియ సులభమవుతుంది. మెల్లగా, ఎక్కువ సేపు నములుతూ తినడం వల్ల ఎక్కువ తినలేదు. సంతృప్తి లభిస్తుంది. 

నిద్రసరిగా లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి.. అది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి వల్ల మూడ్ మారుతుంది. ఏదో తినాలన్న కోరిక పెరుగుతుంది. దీనివల్ల రకరాల ఆహారం తీసుకోవడం, అధిక క్యాలరీలు తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. అందుకే రోజుకు 7నుంచి8 గంటల మంచి నిద్ర పోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. 

చాలామంది నిలుచున్నా, కూర్చున్నా.. ఏదైనా పనిచేస్తున్నా సరైన భంగిమలో ఉండదు. దీనివల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీని ప్రభావం ఆరోగ్యం మీద పడిరకరకాల జబ్బుల బారిన పడతాం. నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందుకే ప్రతీసారి సరిగా కూర్చున్నారా, మీ పోశ్చర్ సరిగానే ఉందా చెక్ చేసుకోండి. 

water

నీళ్లు బాగా తాగండి... బరువు తగ్గించే ప్రయాణంలో నీరు ఒక ముఖ్యమైన భాగం. భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం లేదా ఒక గ్లాసు నీటీతో మీ రోజును ప్రారంభించడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేట్ చేయవచ్చు, ఇది మీ శరీర జీవక్రియను పెంచుతుంది. అధిక కేలరీల ఆహారాలను కూడా దూరంగా ఉంచుతుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. 

click me!