రెండవ గ్రూప్ లో పెకాన్‌లను వారి ఆహారంలో తీసుకునే కేలరీలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చారు. అంతేకాదు వీరు పెకాన్ లను అంతగా తీసుకోలేదు. వీరిలో ఈ ఎనిమిది వారాలలో, రక్తంలో లిపిడ్‌లలో మార్పులు, రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర మొత్తాన్ని గుర్తించడానికి అధిక కొవ్వు ఉన్న భోజనం తీసుకున్నారు. వీరు ఉపవాసం ఉన్నా బ్లడ్ లిపిడ్‌లు రెండు పెకాన్ సమూహాలలో ఒకే విధమైన మెరుగుదలలను చూపించాయి, అయితే పెకాన్‌లను ఆహారంతో పాటు అదనంగా తీసుకున్న గ్రూపులో భోజనానంతర ట్రైగ్లిజరైడ్స్ తగ్గాయి.పెకాన్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. రెండూ తక్కువ కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.