మీరు ఎంచుకున్న ఫెర్ఫ్యూమ్ సరైందేనా? ఎలా ఎంచుకోవాలి?

First Published Aug 28, 2021, 2:44 PM IST

ఎలాంటి పర్ ఫ్యూమ్ మీకు సూటవుతుంది అనే దగ్గర కొంత జాగ్రత్తగా గమనించుకోవాలి. మామూలుగా పర్ ఫ్యూమ్ ఓవరాల్ స్మెల్ ను చెప్పే రకరకాల నోట్స్ ను కలిగి ఉంటుంది.

సరైన పర్ ఫ్యూమ్ ఎంచుకోవడం కత్తిమీద సామే. కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవ్వొచ్చు. ఆ పర్ ఫ్యూమ్ మీకు సూటు కాకపోవచ్చు. మీరు కొనేప్పుడు అనుకున్నది.. ఆ తరువాత వాడుతున్నప్పుడు వేరేలా అనిపించవచ్చు. అందుకే సెంట్ కొనే ప్రతీసారి ట్రయల్ అండ్ ఎర్రర్ రన్ లా ఉంటుంది. అందుకే కొన్ని ప్రతీసారి వాడేవరకూ టెన్షన్ గానే ఉంటుంది. 

నిజానికి పైకి కనిపించకపోయినా ఇది పెద్ద సమస్యే. అయితే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉన్నట్టే దీనికి కూడా ఉంటుంది. ఉంది. మాస్టర్ పెర్ఫ్యూమర్లు కొన్ని సలహాలిస్తున్నారు. సరైన పెర్ఫ్యూమ్‌ను ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన రెండు విషయాలను గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు.

ఎలాంటి పర్ ఫ్యూమ్ మీకు సూటవుతుంది అనే దగ్గర కొంత జాగ్రత్తగా గమనించుకోవాలి. మామూలుగా పర్ ఫ్యూమ్ ఓవరాల్ స్మెల్ ను చెప్పే రకరకాల నోట్స్ ను కలిగి ఉంటుంది.

ఇవి బేస్, టాప్ లేదా హెడ్,  మిడిల్ లేదా హార్ట్ నోట్స్ అని పిలుస్తారు. ఈ మూడు డిఫరెంట్ లేయర్స్ అన్నీ కలిసి దానికి ఒక ప్రత్యేకమైన వాసనను కలిగిస్తాయి. ఉదాహరణకు కొన్ని పరిమళ ద్రవ్యాలు ఫ్లోరల్ అని ఉంటాయి. వీటిలో గులాబీ, గార్డెనియా, జెరేనియం వంటి డిఫరెంట్ సెంట్ నోట్లను కలిగి ఉంటాయి. 

ఇంకొన్నింట్లో  సిట్రస్ లేదా ఆపిల్ అండర్‌టోన్‌లతో కొంచెం ఫ్రూట్ స్మెల్ ఉండొచ్చు. కొన్ని ఎగ్జాటిక్ పర్ ఫ్యూమ్స్ లో సోంపు, దాల్చినచెక్క వంటి స్పైసీ నోట్స్ ఉంటాయి. అందుకే వీటిల్లో మీకు ఏది నచ్చుతుంది అనేదాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక పెర్ ఫ్యూమ్ గాఢత విషయానికి వచ్చేసరికి నాలుగు వివిధ స్థాయిల్లో ఉంటాయి. గాఢత పెరిగిన కొద్దీ ధర పెరుగుతుంది. సాధారణంగా, అధిక సాంద్రత కలిగిన కొలోన్‌లు, పెర్ఫ్యూమ్‌లు మరింత శక్తివంతమైన సువాసన కలిగి ఉంటాయి. ఎక్కువ కాలం ఉంటాయి. అత్యధిక సాంద్రత కేవలం ఒక రోజు మొత్తం ఉండే పెర్ఫ్యూమ్ లేదా పర్ఫమ్ అని పిలువబడుతుంది. 

ఆ తరువాతిది యూ డి పర్ఫమ్, ఇది సాధారణంగా వేసుకున్న తరువాత ఆరు గంటల పాటు ఉంటుంది. మూడవ స్థాయిని యూ డి టాయిలెట్ అంటారు. ఇది రోజుమొత్తం ఉండాలంటే.. రోజులో ఒక్కసారి వేసుకుంటే సరిపోదు. పదే పదే వేసుకోవాల్సి ఉంటుంది. నాల్గవది చాలా తక్కువ సువాసన కలిగిన యూ డి కొలోన్, ఇది కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటుంది.

అందుకే, మీ పెర్ఫ్యూమ్ సువాసనను నిర్ణయించడంలో ఈ రెండు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పెర్ఫ్యూమ్‌లను కొనేముందు స్కిన్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే చర్మంలో కొన్ని హార్మోన్లు, ఫెరోమోన్‌లు ఆ పెర్ ఫ్యూమ్ వాసనను కొద్దిగా మారుస్తాయి. 

click me!