Beauty Tips: వయసు పెరిగిన యూత్ లో కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Published : Sep 26, 2023, 10:14 AM IST

Beauty Tips: అందంగా, వయసు తక్కువగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ఆ ఛాయలు కనిపించడం సహజం. అయితే కొన్ని చిట్కాలను పాటించటం వలన ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం.  

PREV
16
Beauty Tips: వయసు పెరిగిన యూత్ లో కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

చాలామంది 30 సంవత్సరాలు దాటిన తర్వాత అందం మీద పెద్దగా శ్రద్ధ తీసుకోరు. దాని వలన 30 ఏళ్ల వయసులో కూడా 50 ల్లో ఉన్నట్టు కనిపిస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మన ఏజ్ పెరిగినా కూడా ఏజ్ తక్కువగా ఉన్నట్లు కనిపించవచ్చు. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

26

మొదటి చిట్కా ఏంటంటే ఆవాల నూనె ను తలకు స్నానానికి ముందు శరీరం మొత్తానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలకు స్నానం చేయాలి. ఆవాల నూనె లో విటమిన్ ఈ చర్మాన్ని బిగుతుగా మార్చడంలో మీకు సహాయం చేస్తుంది. దాని వలన మీకు చర్మం ముడతలు తగ్గుతుంది.
 

36

అలాగే కొబ్బరి నూనెను కూడా వారానికి రెండు మూడు సార్లు శరీరానికి పట్టించి శుభ్రంగా మసాజ్ చేయండి. ఇందులో కూడా విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేసి వదులుగా ఉన్న చర్మాన్ని టైట్ గా మార్చడంలో సహాయపడుతుంది.

46

 అలాగే కాఫీ ఫేస్ ప్యాక్ కూడా ముఖాన్ని యవ్వనంగా ఉంచడంలో ప్రధాని పాత్ర పోషిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాఫీ పొడిలో పెరుగు, పంచదార కలిపి ముఖానికి స్క్రబ్ చేస్తూ ఉండాలి.
 

56

 డ్రై అయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన చర్మం సహజమైన మెరుపును పొందటంతో పాటు ముడతలను కూడా  తొలగిస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన చిట్కా.. ఎక్కువగా నీరు తాగటం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వలన చర్మం ఎప్పుడూ సజీవంగా కనిపిస్తుంది.
 

66

 ఈ రకంగా వృద్ధాప్య సంకేతాలను దూరం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి రోజుల్లో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీరు తాగాలి. అలాగే కాలానుగుణంగా లభించే పండ్లు తినటం వల్ల కూడా చర్మానికి ఎంతో మంచిది.

click me!

Recommended Stories