మీకు థైరాయిడ్ ఉందా? అయితే ఖచ్చితంగా వీటిని తినండి..

First Published Dec 26, 2022, 10:48 AM IST

మన శరీర జీవక్రియను నియంత్రించే హార్మోన్లను స్రవించే గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి అతి ముఖ్యమైంది. థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కొన్ని రకాల ఆహారాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే.. 
 

మెడకు దిగువన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి మన శరీర జీవక్రియ కార్యకలాపాలకు చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు, మగవారు వయసుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం.. పోషకాహార లోపం, ఒత్తిడి వంటి జీవనశైలి. హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్య మందులు, ఇతర చికిత్సలతో పాటుగా ఆహారం ద్వారా కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు థైరాయిడ్ అసమతుల్యత ఉంటే మీకు ఏ ఆహారాలు మంచి చేస్తాయో తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Coriander water

ధనియాలు 

కొత్తిమీర గింజల్లో  విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును పెంచడానికి సహాయపడతాయి. అలాగే మంటను తగ్గించడానికి తోడ్పడుతాయి. కాలేయ సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి ఉత్తమంగా పనిచేస్తాయి. ఉదయం ఇందుకోసం పరిగడుపున ధనియా వాటర్ ను తాగాలి. 
 

ఉసిరి

ఉసిరికాయలో దానిమ్మ కంటే 17 రెట్లు విటమిన్ సి ఉంటుంది. అంతేకాదు నారింజ కంటే ఎనిమిది రెట్లు విటమిన్ సి ని కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఇది హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. ఉసిరి చుండ్రును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. నెత్తికి రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే జుట్టు తెల్లబడటాన్ని ఆపుతుంది. ఇవన్నీ జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. 
 

పెసరపప్పు

 పెసరపప్పులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, సంక్లిష్ట పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  థైరాయిడ్ రుగ్మత వల్ల కలిగే మలబద్దకాన్ని తగ్గించడంలో ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పెసర పప్పులో ఉండే మంచి విషయం ఏంటంటే.. ఇవి సులువుగా జీర్ణం అవుతాయి. ఇవి థైరాయిడ్ కు స్నేహపూర్వక ఆహారంగా పరిగణించబడుతుంది. థైరాయిడ్ వల్ల తగ్గిన జీవక్రియ రేటు ప్రభావాలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. పెసరపప్పు అయోడిన్ కు మంచి మూలం.
 

కొబ్బరి కాయ

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు  తాజా కొబ్బరి లేదా కొబ్బరి నూనె ను తీసుకోవచ్చు. కొబ్బరి థైరాయిడ్ పేషెంట్లకు సహాయపడే ఉత్తమ ఆహారాలలో ఒకటి. నెమ్మదిగా, మందగించిన జీవక్రియను ఇది మెరుగుపడుతుంది. ఎంసిఎఫ్ఎలు, లేదా మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాలు, ఎంటిసిలు లేదా మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ కొబ్బరిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.
 

Image: Getty Images

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాలను గ్రహించడానికి కీలకమైనది.  శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ, సమతుల్యతను కూడా ఇది ప్రోత్సహిస్తుంది.

click me!