3.ఎర్ర చీమ..
నార్మల్ గా కాదు.. ఎర్ర చీమలు కొన్ని పెద్దవి కూడా ఉంటాయి. అలాంటి ఎర్ర చీమలు కుట్టినా కూడా చాలా మందికి అలర్జీ లాంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఇలాంటి చీమలు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
4.టిక్స్..
ఇవి కుడితే కూడా చాలా ప్రమాదం. ఇవి.. మన శరీరంలో రక్తాన్ని ఎక్కువ పీల్చేస్తాయి. మనుషులు మాత్రమే కాదు.. పెంపుడు జంతువుల ప్రాణాలు కూడా ఇవి తీసేయగలవు. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్న వారికి వీటి గురించి బాగా తెలుస్తుంది. ఇవి మనల్ని కుట్టినప్పుడు నొప్పి కూడా అనిపించదు. కానీ.. ప్రమాదకరమైన వైరస్ లను మన శరీరంలోకి పంపే ప్రమాదం ఉంది.
5.అనసిస్ బగ్స్...
ఈ అనసిస్ బగ్స్ కూడా సాయంత్రపూట ఇంట్లోకి ఈజీగా దూరేస్తూ ఉంటాయి. వీటినే కిస్సింగ్ బగ్స్ అని కూడా పిలుస్తారు. రాత్రిపూట ముఖం, పెదాల దగ్గర ఇవి ఎక్కువగా కరుస్తూ ఉంటాయి. ఇవి కుట్టడం వల్ల ముఖం మీద గాయమే కాదు.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవి మోసుకొచ్చే వైరస్ లు చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాయి.