Women Sleep: మహిళలకు నిద్ర చాలా అవసరం. అయితే ఎవరి పక్కన మహిళలు హాయిగా నిద్రపోతారో తెలుసా? భర్త, బాయ్‌ఫ్రెండ్, తల్లిదండ్రులు అనుకుంటున్నారా? కానే కాదు. ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయం తెలిసింది.
మహిళలకు నిద్ర చాలా అవసరం. వారికి బాగా నిద్రపోవాలంటే భర్త పక్కన లేక తల్లి పక్కన నిద్రపోవాలా? అమెరికాలోని కానిసియస్ యూనివర్సిటీ చేసిన ఓ సర్వే దీన్ని తప్పు అంటోంది. మహిళలు తమ భర్త లేదా భాగస్వామి కన్నా పెంపుడు కుక్క పక్కన పడుకున్నప్పుడే చాలా ప్రశాంతంగా నిద్రపోతారట. అమెరికాలోని కానిసియస్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్టీ ఎల్. హాఫ్‌మన్ బృందం ఈ సర్వేను నిర్వహించింది. మొత్తం 962 మంది మహిళల నిద్ర అలవాట్లు, వారి మానసిక భావనలపై అధ్యయనం చేసింది.
23
అధ్యయనం ఏం చెబుతోంది?
మహిళలు తమ భర్త, పిల్లలతో, తల్లిదండ్రులతో పడుకునే కన్నా వారు తమ పెంపుడు కుక్కలతో నిద్రపోయినప్పుడే ఎక్కువ భద్రతగా, సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మహిళలు కుక్క పక్కన ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతారు. భాగస్వామి పక్కన పడుకున్నప్పుడు వాళ్లు అటు ఇటు దొర్లడం, గురక పెట్టడం వల్ల తమ నిద్రకు భంగం కలుగుతుందని మహిళలు చెప్పారు. కానీ కుక్కలు ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా నిద్రపోతాయి. అందుకే వాటి పక్కన ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్ర పడుతుంది.
33
కుక్క vs పిల్లి vs భర్త
తాజాగా జరిగిన ఈ సర్వేలో పెంపుడు పిల్లుల గురించి కూడా పరిశోధకులు అడిగారు. పెంపుడు పిల్లులు పక్కన కూడా మహిళలు ప్రశాంతంగా నిద్రపోలేరు. పిల్లులు, మగ భాగస్వాములు ఇద్దరూ మహిళల నిద్రను ఒకేలా పాడుచేస్తారని సర్వేలో తేలింది. రాత్రిపూట పిల్లులు చాలా చురుకుగా ఉంటాయి. అందుకే వాటితో కూడా సరిగా నిద్ర పట్టదన్నమాట.
ఏదైనా ప్రమాదం వస్తే కుక్కలు వెంటనే అప్రమత్తం చేస్తాయని మహిళలు నమ్ముతారు. ఈ భద్రతా భావమే వారికి గాఢ నిద్ర పట్టడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగ పెంపుడు కుక్కలు కేవలం విశ్వాసపాత్రమైన జంతువులే కాదు, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.