Fridge: ఫ్రిజ్ లో ఈ వస్తువులు పెడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా?

Published : Jul 24, 2026, 11:01 AM IST

Fridge: ప్రతి నెలా మీ కరెంట్ బిల్లు బాగా పెరిగిపోతోందా? ఆ కరెంటు బిల్లు పెరగడానికి మీ ఇంట్లో ఫ్రిజ్ కారణం కావచ్చు. ముఖ్యంగా ఫ్రిజ్ లో మీరు పెట్టే కొన్ని వస్తువుల కారణంగా కరెంట్ బిల్లు రెట్టింపు అవుతుంది.

PREV
13
ఫ్రిజ్ వాడేటప్పుడు చేయకూడని తప్పులు..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటోంది. ఇక.. ఫ్రిజ్ ఉంది కదా అని పండ్లు , కూరగాయల దగ్గర నుంచి.. వండిన ప్రతి వంటకాన్నీ దాంట్లోనే పెట్టేస్తూ ఉంటారు.అయితే.. కొన్ని రకాల వస్తువులను ఫ్రిజ్ లో పొరపాటున కూడా పెట్టకూడదు. వాటిని పెట్టడం వల్ల కరెంటు బిల్లు బాగా పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి, కరెంట్ బిల్లు పెరగకుండా ఉండాలంటే.. ఫ్రిజ్ లో పెట్టకూడనివి ఏంటి..?

23
వేడిగా ఉన్న ఆహారం...

చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇది. వంట పూర్తైన తర్వాత ఆ ఆహారం పూర్తిగా ఆరకముందే.. తీసుకెళ్లి నేరుగా ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటారు. కొంచెం వేడిగా ఉన్నా కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వేడి కారణంగా ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని మళ్లీ చల్లగా మార్చడానికి కంప్రెసర్ ఎక్కువసేపు పని చేస్తుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుంది. అందుకే, కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఆహారం పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఫ్రిజ్ లో పెట్టాలి.

ఫ్రిజ్ లో గ్యాప్ లేకుండా వస్తువులు పెట్టేయడం..

ఈ తప్పు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఫ్రిజ్ లో ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా.. ఏదో ఒక వస్తువు ఇరికించి పెట్టేస్తూ ఉంటారు. కానీ, ఫ్రిజ్ ను పూర్తిగా నింపితే చల్లని గాలి సరిగా తిరగదు. దీంతో, అన్ని వస్తువులు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని కోసం... ఫ్రిజ్ ఎక్కువ సేపు పని చేయాల్సి ఉంటుంది. అందుకే కరెంట్ బిల్లు పెరుగుతుంది. ఆ పొరపాటు చేయకూడదు.గాలి ప్రసరించడానికి గ్యాప్ ఉంచేలా ఫ్రిజ్ లో వస్తువులు పెట్టాలి.

33
మూత లేకుండా ఆహారాలు పెట్టడం...

ఫ్రిజ్ లో ఆహారం నిల్వ చేసేటప్పుడు.. వాటికి కచ్చితంగా మూతలు ఉండాలి. మూత లేకపోవడం వల్ల.. తేమ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ అదనపు తేమను తొలగించడానికి కూడా ఫ్రిజ్ ఎక్కువ శ్రమ పడుతుంది. అందుకే.. మూత లేకుండా ఫ్రిజ్ లో పెట్టకూడదు.

పెద్ద నీటి పాత్రలు..

ఒకేసారి నీరు చల్లగా మార్చాలని పెద్ద పాత్రల్లో నీటిని నింపి.. వాటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. వాటిని చల్లగా మార్చడానికి కూడా ఫ్రిజ్ ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. వేడిగా ఉండే డ్రింక్స్.. టీ, కాఫీ లాంటివి కూడా ఫ్రిజ్ లో డైరెక్ట్ గా ఉంచకూడదు. దీని వల్ల కూడా కరెంట్ బిల్లు బాగా పెరుగుతుంది.

తడిగా ఉన్న కూరగాయలు..

ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టేటప్పుడు కూడా చాలా మంది వాటిని శుభ్రం చేసి.. ఆ తడితోనే ఫ్రిజ లో పెట్టేస్తూ ఉంటారు. ఈ పొరపాటు కూడా ఎప్పుడూ చేయకూడదు. తడి కూరగాయలను ఫ్రిజ్ లో పెడితే అదనపు తేమ ఏర్పడుతుంది. దీనితో.. కూలింగ్ సామర్థ్యం కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొన్ని రకాల వస్తువులను ఫ్రిజ్ లో ఉంచకూడదు. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, పండని అరటిపండ్లు లాంటివి పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. వీటిని బయట మాత్రమే ఉంచాలి.

Read more Photos on
click me!

Recommended Stories