సి విటమిన్ పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలామంది రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయ పిండుకుని తాగుతుంటారు.
మరికొంతమంది సమయం దొరికినప్పుడు నిమ్మకాయనీళ్లు తాగడానికి ఇష్టపడతారు. అయితే నిమ్మకాయనీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ చర్మానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
నిమ్మకాయ నీళ్లూ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గకుండా ఉంటుంది. దీనివల్ల చర్మం అందంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.
చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. నిమ్మకాయ నీరు కొల్లాజెన్ తయారీకి తోడ్పడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
చర్మాన్ని నిమ్మకాయ నీరు రిపేర్ చేస్తుంది. గాయాల్ని మానేలా చేస్తుంది.
మొటిమలు రాకుండా.... జీర్ణక్రియ సరిగా లేకపోవడం మొటిమలకు దారితీస్తుంది. నిమ్మకాయ నీరు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది.
చర్మకాంతిని పెంచడానికి సహజమైన బ్లీచ్ గా నిమ్మకాయ పనిచేస్తుంది. చర్మాన్ని రంగు తగ్గించి, కాంతివంతంగా చేస్తుంది.
నిమ్మకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీది దురదలతో ఫైట్ చేస్తాయి. దీనివల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
దంతాలు ముత్యాళ్లా మెరిసిపోవాలంటే రోజూ నిమ్మకాయ నీళ్లు తాగాలి. నిమ్మకాయ పళ్లమీద గారపట్టడం, మరకలు కాకుండా నిరోధిస్తుంది.
సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి మీ చర్మం కాంతివంతంగా, అందంగా మెరిసేలా చేస్తుంది.
శరీరంలోపలి, చర్మం మీది విషపదార్థాలు తొలగించడంలో నిమ్మకాయ నీల్లు అద్భుతంగా పనిచేస్తాయి.