మష్రూమ్ గూగ్లీ డిమ్ సిమ్.. విరాట్ కోహ్లీ ఫేవరేట్ డిష్.. ఎలా తయారు చేస్తారంటే..

First Published | Apr 7, 2022, 1:24 PM IST

విరాట్ కోహ్లీ ఆల్ టైం ఫేవరేట్ డిష్ ఏంటో తెలుసా?.. మష్రూమ్ గూగ్లీ డిమ్ సిమ్.. తన సొంత రెస్టారెంట్ అయిన one8communeలో చేసే ఈ డిష్ అంటే విరాట్ పడి చచ్చిపోతాడు. 

మష్రూమ్ గూగ్లీ డిమ్ సిమ్ ను ఎలా తయారు చేయాలో one8commune కార్పొరేట్ చెఫ్, ఆర్&డి ఎగ్జిక్యూటివ్ అయిన పవన్ బిష్తా ఇలా వివరిస్తున్నారు. చూడండి.. 

స్టఫ్పింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
సాచురేటెడ్ బటన్ మష్ రూమ్స్  100గ్రా.లు
సాచురేటెడ్ హిమాలయన్ షిటేక్  50 గ్రా.లు
ఉల్లికాడలు   10 గ్రా.లు
క్రీమ్ చీజ్     40 గ్రా.లు
రుచికి తగినంత ఉప్పు, కారం...

Latest Videos


పిండి తయారీకి కావాల్సినవి.. 
పొటాటో స్టార్చ్    90 గ్రా.లు
వీట్ స్టార్చ్          60 గ్రా.లు
బీట్ రూట్ జ్యూస్  400 గ్రా.లు (అవసరం అయితేనే..)

తయారు చేసే విధానం.. 
స్టెప్ 1
ఒక గిన్నెలో పొటాటో స్టార్చ్, వీట్ స్టార్చ్, తగినంత ఉప్పు, బీట్ రూట్ జ్యూస్ కలపాలి. బీట్ రూట్ జ్యూస్ మీకు ఇష్టమైతే వాడొచ్చు.. లేకుంటే లేదు.. దీనికి బదులు నీళ్లు వాడి పిండిని కలపొచ్చు. 

స్టెప్ 2
ఒక గిన్నెలో నూనె వేడిచేసి.. సాచురేటెడ్ బటన్ మష్ రూమ్స్, సాచురేటెడ్ హిమాలయన్ షిటేక్ ముక్కలు, ఉల్లికాడలు వేసి బాగా కలిపి.. కొద్ది నిమిషాల సేపు వేయించాలి. 

స్టెప్ 3
కొద్ది సేపటి తరువాత ఈ కూరగాయ ముక్కలన్నింటినీ స్టౌ మీది నుంచి దింపి.. చల్లారనివ్వాలి. తరువాత దీనికి ఉప్పు, కారం లేదా పెప్పర్ రుచికి తగినంతగా కలుపుకోవాలి. చివరికి దీనికి క్రీమ్ చీజ్ చేర్చి కలపాలి.

ಮೋಮೋಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿಯ ಅತ್ಯಂತ ಫೇವರಿಟ್ ತಿಂಡಿ.

స్టెప్ 4
ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని చిన్న పూరీల్లాగా చేసి వాటి మధ్యలో ఒకటి, రెండు చెంచాల కూరను పెట్టి అంచులు కలుపుతూ సీల్ చేసేయాలి.. 

mushroom googly dimsum

స్టెప్ 5
ఇక ఇప్పుడు ఈ డిమ్ సిమ్ లను 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. చివర్లో కొన్ని చుక్కల ట్రఫ్ఫుల్ ఆయిల్ తో గ్రీజ్ చేయాలి. వీటిని వేడి వేడిగా మీకిష్టమైన చట్నీతో వడ్డించండి. 

click me!