Health Tips: ఉప్పులేని పప్పుచారు చప్పగా ఉంటుందేమో గానీ.. మోతాదుకు మించి ఫుడ్ లో ఉప్పును వేస్తే మాత్రం వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ.. ఇన్నీ కాదు.. ఒకవేళ మీరు ఉప్పును ఎక్కువగా తిన్నారో.. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కాలెయం దెబ్బతినడం, అంధత్వం వంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Health Tips: దేన్ని మితిమీరితీసుకున్నా మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆరోగ్య సూత్రం ఉప్పుకు కూడా వర్తిస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఉప్పులేని కూరలు తినలేమనేది వాస్తవమే కానీ.. ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి కూడా ప్రాణాల మీదికి రావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుననారు.
210
అందుకే పప్పులు, కూరలు, పచ్చడిలల్లో, బిర్యానీల్లో ఉప్పు శాతాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
310
ఉప్పు మనకెంత అవసరం.. సాధారణంగా మనం తీసుకునే చాలా ఆహార పదార్థాల్లో సోడియం ఎంతో కొంత ఉంటుంది. దీనికి తోడు ఉప్పును మరింత ఎక్కువగా వాడితే మాత్రం మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తికి రోజుకు రెండు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు అవసరం లేదు. కానీ చాలా మంది ఇంత క్వాంటిటీకి మించి ఉప్పును తీసుకుంటున్నారు. ఒకవేళ ఉప్పును ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో ఖనిజాలు, నీరు అసమతుల్యంగా ఉంటాయి. కండరాల పనితీరు కూడా దెబ్బతీస్తుంది. దీంతో మీ శరీరానికి అవసరమైన శక్తి అందదు.
410
ఉప్పును ఎక్కువగా వాడితే.. మీ కూరల్లో ఉప్పు శాతం ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే కూరల్లో ఉప్పు ఎక్కువైతే రక్తంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో నీరు రక్తప్రవాహంలో కలుస్తుంది. తద్వారా మీ రక్తం పల్చగా అవుతుంది. దీనివల్ల మీరు హైపర్ టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. దీనికి సకాలంలో వైద్యం చేయించుకోకపోతే ప్రాణాంతక రోగాల బారిన పడతారు.
510
అవేంటంటే ప్రమాదకరమైన గుండె పోటు, అంధత్వం, బ్రెయిన్ స్ట్రోక్, Kidney failure,Heart failure, కాలెయం దెబ్బతినడం వంటి జబ్బుల పాలయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
610
ఈ జబ్బులన్నీ దీర్ఘకాలం పాటు ఉప్పును ఎక్కువగా తినడం వల్లే వస్తాయట. అలా అని ఉప్పును పూర్తిగా తినకపోయినా గానీ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సోడియం కంటెంట్ ను తక్కువ మొత్తంలో తీసుకోండి.
710
మూత్రపిండాల జబ్బులు, హై బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉప్పును తక్కువగా తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు కంటెంట్ ను తగ్గించడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
810
అంతేకాదు దీనివల్ల మన శరీరం నుంచి ద్రవాలు ఎక్కువగా బయటికి పోయే అవకాశం ఉండదు. అలాగే Electrolyte కూడా సమతుల్యంగా ఉంటుంది. దీంతో మీరు ఆరోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. అదే ఉప్పు కంటెంట్ ఎక్కువైతే మాత్రం మీరు తరచుగా అలసటకు గురవడం, నీరసం వంటి సమస్యలు వేధిస్తాయి.
910
ఏమి తినాలి.. ఇంట్లో వండే ప్రతి వంటకంలో ఉప్పును వీలైనంత తక్కువగా వేసుకోవాలి. అంటే మోతాదుకు మించి వేసుకోకూడదన్న మాట. కానీ కొన్నింటిని మాత్రం ఉప్పు వేసుకోకుండానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
1010
ಉಪ್ಪು : ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಓಕೆ. ಆದರೆ ಅಗತ್ಯಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಉಪ್ಪು ಸೇವನೆ ಮಾಡಿದರೆ ಅದರಿಂದ ಕಿಡ್ನಿ ಸಮಸ್ಯೆ, ಬ್ಲಡ್ ಪ್ರೆಶರ್ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ಈ ಸಮಸ್ಯೆ ಕಾಣಿಸಿಕೊಂಡರೆ ಫಿಟ್ ಆಗಿರಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಫಿಟ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಂಗ್ ಆಗಿ ಕಾಣೋದಿಲ್ಲ.
పండ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, బీన్స్, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో ఉప్పును చాలా తక్కువ మొత్తంలో వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.