Radhika Merchant: ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీకి రెండేళ్ల క్రితం రాధిక మర్చంట్ తో వివాహం జరిపించిన విషయం తెలిసిందే. అయితే.. రాధికనే సెలక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా?
మన దేశంలో అపర కుబేరుడు అనగానే వెంటనే ముఖేష్ అంబానీ పేరు వినపడుతుంది. అనేక వ్యాపారాలు చేస్తూ.. ప్రతి వ్యాపారంలోనూ సక్సెస్ అవుతూ అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. తన వ్యాపార బాధ్యతలు ముఖేష్ అంబానీ ఒక్కరే చూసుకోరు. వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కీలక పాత్రలు పోషిస్తారు. ఆయన భార్య నీతా అంబానీ, కొడుకులు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలు మాత్రమే కాదు... కూతురు ఇషా అంబానీ, కోడళ్లు రాధిక అంబానీ, శ్లోకా అంబానీలు కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తుంటారు.
23
భర్తపై రాధిక ప్రేమ...
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంత్ అంబానీ చిన్న నాటి స్నేహితురాలు రాధిక తో వివాహం జరిగింది. అయితే.. ఆ సమయంలో వీరి పెళ్లి పై చాలానే కామెంట్స్ వినిపించాయి. డబ్బు ఉంది కాబట్టే.. రాధిక అనంత్ ని పెళ్లి చేసుకుందని మాట సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినపడింది. కానీ..అనంత్ పై ఆమెకు ఉన్న ప్రేమ కారణంగానే వీరి పెళ్లి జరిగింది అనే విషయాన్ని ఇటీవల రాధిక ప్రూవ్ చేసింది.
ఇటీవల కొద్ది నెలల క్రితం, అనంత్, రాధిక ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో.. అనంత్ అంబానీ స్పీచ్ ఇస్తున్నాడు. ఆ స్పీచ్ ని చూస్తున్న రాధిక... ఆనందంగా దానిని తన ఫోన్ లో రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భర్తపై అంత ప్రేమ ఉంది కాబట్టే.. సంతోషంగా అతని స్పీచ్ రికార్డు చేస్తోందని...ఈ ప్రేమ కారణంగానే ముఖేష్ అంబానీ.. రాధికను తన చిన్న కోడలిగా సెలక్ట్ చేసుకున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం.
33
అల్లుడు కూడా తక్కువేమీ కాదు...
కేవలం, రాధిక మాత్రమే కాదు...ముఖేష్ అల్లుడు ఆనంద్ పెరుమాల్ కూడా నెటిజన్ల మనసు గెలిచాడు. ఓ ఈవెంట్ లో.. తన భార్య ఇషా అంబానీ చాలా అందంగా ముస్తాబై రాగా... వేరే ఒకరికి ఫోన్ ఇచ్చి మరీ.. ఆనంద్ భార్య ఇషాతో ఫోటో దిగాడు. తమ జీవిత భాగస్వామిపై వీరు చూపిస్తున్న ప్రేమకు ఇప్పుడు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తమ పిల్లలకు కోట్ల విలువ చేస్తే ఆస్తులతో పాటు.. మంచి ప్రేమను పంచే సరైన లైఫ్ పార్ట్నర్ ని ముఖేష్ ఇచ్చాడు అని ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.