ఈ పొరపాట్లు చేస్తే.. డబ్బు ఇంట్లో నిలవదు..!

First Published Jun 2, 2023, 2:13 PM IST

సంపాదించే దానిలో కొంత ఖర్చ చేసినా, కొంత దాచుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడు ఆదాయం కనపడుతుంది. ఓవర్ గా ఖర్చు పెడితే అప్పులే మిగులుతాయి.

డబ్బు సంపాదించాలని, జీవితంలో సుఖపడాలని అందరూ కోరుకుంటారు. అయితే, కొందరికి ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, డబ్బు కూడ పెట్టలేరు. వారు చేసే పొరపాట్ల కారణంగా డబ్బుని ఆదా చేయలేరట. మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూసేద్దామా..
 

1.కొందరు వారు సంపాదించేది రూపాయి అయితే, ఖర్చుపెట్టేది రెండు రూపాయలు ఉంటుంది. ఇలా సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల వారికి ఆదాయం కనపడదు. కాబట్టి, సంపాదించే దానిలో కొంత ఖర్చ చేసినా, కొంత దాచుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడు ఆదాయం కనపడుతుంది. ఓవర్ గా ఖర్చు పెడితే అప్పులే మిగులుతాయి. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తూ ఉండాలి. అవసరంలేని వాటికి ఖర్చు చేయడం మంచిది కాదు.
 

2.చాలా మందికి ఏదైనా కనపడగానే వెంటనే కొనేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు రెండు విషయాలు ఆలోచించాలి. మనం నిజంగా అవసరమా లేదా కావాలని కోరుకుంటున్నామా అని. నిజంగా అది అవసరమైతే కొనచ్చు. కోరిక అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే డబ్బులు వృథా అయిపోతాయి.

3.మనకు వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు ఎప్పుడూ ఓ బడ్జెట్ వేసుకోవాలి. అలా బడ్జెట్ వేసుకోలేని సమయంలో ఖర్చులు పెరిగిపోతాయి. మనం బడ్జెట్ వేసుకోవడం వల్ల, ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాం.. దేనికి అనవసర ఖర్చులు పెడుతున్నాం, ఎక్కడ ఆదా చేయవచ్చు అనే విషయాలు తెలుస్తాయి.

4.ఈ రోజుల్లో అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉంటున్నాయి. ఇవి చేతిలో ఉంటే తెలీకుండానే ఎక్కువ ఖర్చ చేస్తూ ఉంటాం. కానీ, అలా కాకుండా, షాపింగ్ లాంటి ప్లేసులకు వెళ్లినప్పుడు ఏం కొనాలి అనుకుంటున్నారో దానికి తగినంత డబ్బులు మాత్రమే తీసుకువెళ్లాలి. కార్డులు వెంట పెట్టుకొని వెళ్లకూడదు. అలా చేయడం వల్ల  ఏది అవసరమో అంతవరకే కొంటాం. చేతిలో ఉన్న డబ్బుల వరకే ఖర్చు చేస్తాం. ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉండదు.
 

5.కొందరు వచ్చిన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ ఖర్చులు ఉంటాయి కదా అనే ఆలోచన ఉండదు. కొంచెం కూడా ఆదా చేయరు. దాని వల్ల కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బందిపడతారు.

6.ఇక కొందరు తమ సంపాదన మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. ఇది మంచి పద్దతే కానీ. కరెక్ట్ పద్దతిలో, తెలివిగా పెట్టుబడులు పెట్టరు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతారు. సంపాదించడమే కాదు, తెలివిగా పెట్టుబడులు పెట్టడం కూడా తెలిసి ఉండాలి.
 


7.కొందరు పెట్టుబడులు పెడతారు. కానీ ఎందులో పెట్టాం, ఎంత పెట్టాం.. ఎప్పుడు పెట్టాం అనే విషయాలు మర్చిపోతారు. పెట్టుబడులకు సంబంధించి రికార్డులు మెయింటైన్ చేయాలి. లేకపోతే సమస్యల్లో పడతారు. 
 

click me!