ఈ ఆహారపు అలవాట్లు మీ గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి జాగ్రత్త..

First Published Sep 27, 2022, 11:44 AM IST

మనం మానసికంగా, శరీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మన గట్ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేడు చాలా మంది చెడు ఆహారాలనే తింటున్నారు. వీటివల్ల హెల్త్ పాడవడమే కాదు గట్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లేంటో తెలుసుకుందాం పదండి..
 

fiber

ఫైబర్  ఫుడ్ ను తక్కువగా తినడం

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటేనే మీ పేగు కదలికలు సరిగ్గా ఉంటాయి. లేదంటే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గట్ వ్యవస్థ అనేక సూక్ష్మజీవులకు, వ్యాధిని కలిగించే వ్యాధికారక క్రిములకు సంతానోత్పత్తి  కేంద్రం కాబట్టి. అందుకే ఫైబర్ కంటెంట్ ను ఎక్కువగా తీసుకోండి. అప్పుడే మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. 
 

తగినంత నీరు తాగకపోవడం

నీటిని ఒకరకంగా సర్వ రోగ నివారిణీ అనొచ్చు. ఎందుకంటే మన శరీరంలో నీటి కంటెంట్ సరిపడా లేకపోతేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే నీటిని ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. రోజులో నీటిని తక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడటమే కాదు భోజనం చేసిన తర్వాత మీ జీర్ణక్రియ ప్రక్రియ దెబ్బతింటుంది కూడా.  మీకు తెలుసా.. డీహైడ్రేషన్ మీ ప్రాణాలను కూడా తీయొచ్చు. అందుకే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి.

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం

చక్కెరతో చేసిన ఆహార పదార్థాలు టేస్టీగా అనిపించినప్పటికీ.. షుగర్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. షుగర్ కంటెంట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గట్ మైక్రోబయోమ్‌కు భంగం కలుగుతుంది. మన శరీరం కొన్నిసార్లు ఓవర్‌లోడ్ చేయబడిన చక్కెర పదార్థాలను ప్రాసెస్ చేయడంలో విఫలమవుతుంది. అందుకే షుగర్ కంటెంట్ ను ఎక్కువగా తీసుకోకండి.

తృణధాన్యాలను తినకపోవడం

తృణధాన్యాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల గట్ మైక్రోబయోమ్ సమతుల్యంగా ఉంటుంది. గట్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వీటిని తినని వారు ఇప్పటినుంచైనా తినే అలవాటును చేసుకోండి. 
 

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కొవ్వు పదార్థాల వల్ల అజీర్థి, ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి. 

ఎప్పుడు పడితే అప్పుడు తినడం

తినడానికంటూ సమయం పెట్టుకోకుండా ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటే కూడా మీ జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాత్రివేళ హడావుడిగా తినడం, సరిగ్గా నమలకపోవడం వంటివి కూడా గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

అతిగా తాగడం

మద్యపానం ఏ రకంగా చూసినా ఆరోగ్యానికి హానికరమే. అందులో కొంతమంది మోతాదుకు మించి లాగించేస్తుంటారు. ఆల్కహాల్ ను మితిమీరి తాగడం వల్ల  గట్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

తగినంత ప్రోబయోటిక్స్ లేకపోవడం

పులియబెట్టిన ఆహారాల్లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతారు. పులియబెట్టిన ఆహారాల్లో జీర్ణక్రియను వేగవంతం చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

నాన్-సీజనల్ ఫుడ్స్ తీసుకోవడం

ఈ సీజన్ లో పండాల్సిన కూరగాయలు కాకపోయినా కొందరు పండిస్తుంటారు. ఇందుకోసం వాటికి ఎన్నో ఎరువులు, పురుగుల మందులను వాడుతారు. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇలాంటి వాటిని తినకపోవడమే మంచిది. కాలానుగుణంగా, సహజంగా పెరిగే పండ్లు, కూరగాయలను మాత్రమే తినండి.

click me!