బరువు తగ్గాలని తినడం మానేయాల్సిన అవసరం లేదు.. ఈ ఎల్లో ఫుడ్స్ ను తినండి ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..

First Published Oct 9, 2022, 11:32 AM IST

బరువు తగ్గాలను కడుపును మాడ్చుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. వీళ్లకు తెలియని విషయం ఏంటంటే.. కొన్ని రకాల ఆహారాలను తింటే చాలా అంటే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.

అవసరమైన దానికంటే ఎక్కువ తినడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను రోజూ లాగించడం, బరువును పెంచే ఆహారానలు తినడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుంది. రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలనే తింటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. బరువు నియంత్రణలో ఉండటే కాదు.. బరువు కూడా ఫాస్ట్ గా తగ్గుతారు.  

బరువు తగ్గేందుకు ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ఇవి మీ శరీరాన్ని బలంగా ఉంచి.. తొందరగా కడుపు నిండేలా చేస్తాయి. అయితే కొన్ని రకాల ఎల్లో కలర్ లో ఉండే ఆహారాలు కూడా బరువు ను చాలా ఫాస్ట్ గా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 

నిమ్మకాయ

నిమ్మ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా.. ఇంతా కాదు.. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో రకాల అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెండ్లు శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ ను బయటకు పంపేందుకు సహాయపడతాయి. అలాగే జీవక్రియ ను కూడా పెంచుతాయి. నిమ్మకాయను పానీయంగా లేదా సలాడ్ గా తీసుకోవచ్చు. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. 
 

అల్లం

ప్రతి వంటగదిలో అల్లం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మసాలా దినుసు కూరలను టేస్టీగా చేయడమే కాదు.. దీనిలో ఉండే ఔషదగుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అల్లంతో పానీయాన్ని తయారుచేసుకుని తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని నీళ్లను వేడి చేసి.. అందులో కొన్ని చిన్న చిన్న అల్లం ముక్కలను వేసి కలపాలి. ఈ వాటర్ ను ఉదయం పరిగడుపున తాగితే మీరుకున్న సైజ్ లోకి మారిపోతారు. 

ఎల్లో క్యాప్సకం
 
చాలా మటుకు ఆకుపచ్చని క్యాప్సికంలనే ఎక్కువగా తింటుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ పసుపు పచ్చని క్యాప్సికం ను తింటే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్యాప్సికం కడుపు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. అయితే కొంతమంది దీనిని కూర చేసుకుని తింటుంటారు. అయితే దీనిని సలాడ్ గా చేసుకుని కూడా తినొచ్చు. 

అరటిపండు

సీజన్లతో సంబంధం లేకుండా అరటిపండ్లు అందుబాటులో ఉంటాయి. రోజుకో అరటిపండును తింటే ఎలాంటి జబ్బులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే అరటిపండును తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారట. అయితే వీటిని ఎక్కువ మాత్రం తినకూడదు. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే తొందరగా ఆకలి కానీయదు.  
 

click me!