ఈ రెండింటి వల్లే వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికం.. పరిశోధనల్లో సంచలన విషయాలు

First Published | Dec 26, 2024, 5:33 PM IST

ప్రస్తుతం క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత కూడా ఈ ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు చిన్న వారిలో కూడా ఎక్కువుతోంది. అయితే క్యాన్సర్‌ రావడానికి ప్రధానంగా రెండు రకాల అంశాలు కారణమవుతున్నాయని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.. 
 

క్యాన్సర్‌.. ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో ఇదీ ఒకటి. రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ డైటీషియన్‌ క్యాన్సర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జెన్‌ జెడ్‌ వ్యక్తుల్లో క్యాన్సర్‌ రావడానికి రెండు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. 

1997 నుంచి 2012 మధ్యలో జన్మించిన వారిని జెన్‌ జెడ్‌గా అభివర్ణిస్తుంటారు. ఈ సమయంలో జన్మించిన వారిలో క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతున్నట్లు అధ్యయనల్లో వెల్లడైంది. నికోల్‌ అనే డాక్టర్‌ ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. స్మోకింగ్‌కు, క్యాన్సర్‌కు మధ్య లోతైన సంబంధం ఉందని ఆయన తెలిపారు. చెడు ఆహారం కూడా శరీరంలో ప్రమాదకరమైన కణాలు వృద్ధికి కారణమవుతుందని ఆయన తెలిపారు. ఇక 1990వ దశకం నుంచి ఈ తరహా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ఎక్కువగా యువత వీటి బారిన పడుతున్నారు. క్యాన్సర్ రీసెర్చ్ UK బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం 44,100 కొత్త కోలన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్‌)  కేసులు సంభవిస్తున్నాయని పేర్కొంది.


ప్రాసెస్ ఆహారం

సర్రిలైవ్ ప్రకారం, ఒకే రోజులో 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు 18% పెరుగుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. స్టోర్‌లో ముందుగా ఉడికించిన హాట్ డాగ్‌లు, సాసేజ్, బేకన్, డెలి మీట్‌లు వంటివి కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇవన్నీ పెద్ద పేగు క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. పెద్దపేగు క్యాన్సర్‌ను పురీషనాళం అని కూడా అంటారు. ఈ క్యాన్సర్‌ లక్షణాలు త్వరగా కనిపించవు. మొదట దాన్ని గుర్తించడం కూడా కష్టం. అందువల్ల ఈ క్యాన్సర్‌ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఆల్కహాల్

పెద్ద పేగు క్యాన్సర్‌కు ఆల్కహాల్‌, ప్రాసెస్‌ చేసిన మాంసం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్ మాత్రమే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహారాలు అని నికోల్ చెప్పారు. ఆల్కహాల్‌లో బీర్, వైన్, స్పిరిట్స్ వంటివి క్యాన్సర్‌కు కారణమవుతుందని చెప్పుకొచ్చారు. ఆల్కహాల్‌ వల్ల వచ్చే క్యాన్సర్‌ కేవలం పెద్ద పేగుకు మాత్రమే పరిమితం కాదని, ఇది నోరు, గొంతు, వాయిస్ బాక్స్, అన్నవాహిక, పురీషనాళం, కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుందని అన్నారు. 

Latest Videos

click me!