Relationship Tips: ఇలా చేస్తే భార్యా భర్తల మధ్యన అసలు గొడవలే జరగవు..

First Published | Apr 9, 2022, 11:16 AM IST

Relationship Tips: భార్యా భర్తలన్నాక గొడవలు, కొట్లాటలు చాలా కామన్. వీటిని ఎంత తొందరగా మర్చిపోతీ వీరి బంధం అంత సంతోషంగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు చిన్న గొడవలైనా.. విడాకుల వరకు వెళ్లిపోతుంటారు. అలా జరగకూడదంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే. 
 

Relationship Tips:సింగిల్ లైఫ్ కు, మ్యారేజ్ లైఫ్ కు చాలా తేడా ఉంటుంది. పెళ్లి తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటూ కుదరదు. భార్య  లేదా భర్తకు అనుకులంగా.. ఇద్దరికీ నచ్చినట్టుగా లైఫ్ ను లీడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 
 

ఆలు మగలన్నాక ప్రేమలు, బుజ్జగింపులు,  అలకలు, చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు చాలా కామన్. సమయాను సందర్భంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అని వాటినే పట్టుకుని వేళాడితే ఫ్యూచర్ లో ముందుకు వెళ్లలేరు. గొడవలను, కొట్లాటలను వీలైనంత తొందరగా మర్చిపోతేనే వీరు ఆనందంగా ఉంటారు. 
 

Latest Videos


అయితే కొంతమంది భార్యా భర్తలు అప్పుడే గొడవపడి మరుక్షణంలో ఒకటైపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం వాటినే కారణాలుగా చూపుతూ.. ఒకే ఇంట్లో బద్ద శత్రువులు లాగా ప్రవర్తిస్తుంటారు. వారి భాగస్వామి ముఖం చూడటానికి కూడా ఇష్టపడని సందర్భాలు లేకపోలేదు. 

అహం, కోపం తో రగిలిపోతూ.. భాగస్వామిని ద్వేషిస్తుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల వారి బంధం శాశ్వతంగా విడిపోయే ప్రమాదం ఉంది. ఇలా ప్రవర్తిస్తే మీ పెళ్లి బంధం ఎక్కువ రోజులు కొనసాగదు కూడా.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భార్యా భర్తల మధ్యన గొడవలు జరగకూడదంటే కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉండాలట. ఆ విషయాలను తెలుసుకుంటే ఆలుమగల మధ్యన అసలు గొడవలే జరగవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.. భాగస్వామితో గొడవ పడినప్పుడు తమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం పూర్తిగా మానేస్తుంటారు. గొడవల మూలంగా భాగస్వామిపై కోపం, అహం చూపిస్తూ వారిని మరింత బాధపెడతారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే విడాకుల వరకు కూడా వెళ్లొచ్చు. 
 

అలా కాకూడదంటే మీ భాగస్వామిని అర్థం చేసుకోండి. వారు కూడా తిరిని మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. గతాన్ని తవ్వకుండా సంతోషంగా ఉండేందు ప్రయత్నించండి. వాళ్లు చెప్పేది వినండి. మీ ప్రాబ్లం ని చెప్పండి. ఇలా అయితేనే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. 
 

సమయం కేటాయించండి..  పార్టనర్ తో గొడవ జరిగితే చాలు ఇక వారితో మాట్లాడటం పూర్తిగా మానేస్తుంటారు. అవతలి వారు మాట్లాడాలని ట్రై చేసినా.. నువ్ ఇలా అన్నావ్ అలా అన్నావ్ అని ఎత్తిపొడుస్తుంటారు. దీనివల్ల మీ మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప.. తగ్గదు. కాబట్టి వారిని ఒంటరిగా వదిలేయకుండా టైం కేటాయించి మీ భాగస్వామితో మాట్లాడండి. దీంతో మీ మధ్య మనస్పర్థలన్నీ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

నిర్లక్ష్యం వద్దు..  ఇద్దరి మధ్య  గొడవలు జరిగితే చాలు.. ఇక భాగస్వామి గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేస్తుంటారు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. నువ్వెవరో నేనెవరో అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల మీ మధ్య దూరం చాలా పెరుగుతుంది. ఇది విడాకుల వరకు దారి తీయొచ్చు. కాబట్టి గొడవలు కామన్. వాటినే పట్టుకుని వేలాడితే మీరు హ్యాపీగా ఉండలేరు. ఒకమెట్టు దిగి మీ భాగస్వామితో మాట్లాడండి. వారిని పట్టించుకోండి. 

click me!