ఒత్తిడి.. ప్రస్తుత కాలంలో ఒత్తిడి కూడా ఒక వ్యాధిగా మారిపోయింది. ఒత్తిడిలేని మనిషి లేడు అనడంలో ఎలాంటి అనుమానం లేదేమో. ఈ ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్య, అధిక రక్తపోటు, ఆందోళన, ఆకలిలో మార్పులు వంటి ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి కారణంగా జుట్టు మూల కణాలు బలహీనంగా మారిపోతుంటాయి. దీంతోనే జుట్టు తెల్లబడటం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.