ధర తక్కువ డ్రెస్ లు కొంటున్నారా? అయితే వాటిని ఇలా చెక్ చేయడం మర్చిపోకండి

First Published | Aug 18, 2024, 12:52 PM IST

మనలో చాలా మంది తక్కువ ధరలో మంచి దుస్తులు రావాలని కొంటుంటారు. అందుకే తక్కువ ధర ఉన్న దుస్తులను కలర్ నచ్చితే కొనేస్తుంటారు. కానీ దీనివల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే తక్కువ ధర దుస్తులు కొనేటప్పుడు ఏం చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మనలో ప్రతి ఒక్కరికీ షాపింగ్ అంటే ఎక్కడ లేని ఇష్టం. నెలకోసారైనా ఖచ్చితంగా షాపింగ్ చేస్తుంటాం. ముఖ్యంగా డ్రెస్ లు. అయితే కొన్ని కొన్ని సార్లు మార్కెట్ లో దొరికే తక్కువ ధర డ్రెస్ లను కొంటుంటాం. తక్కువ ధరకే మంచి డ్రెస్ లు వస్తే ఎవరు కొనకుండా ఉంటారు చెప్పండి. కానీ ఇక్కడే మనం మోసపోయే ప్రమాదం ఉంది. ధర తక్కువే అని కొంటే మాత్రం అవి మీకు సెట్ కాకపోవచ్చు. లేదా క్వాలిటీ సరిగ్గా లేకపోవచ్చు. స్టిచ్చింగ్ బాగా లేకపోవచ్చు. ఇవన్నీ ఉండకూడదంటే తక్కువ ధరకే డ్రెస్ లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

డ్రెస్ ఫ్యాబ్రిక్

మీరు డ్రెస్ లను కొన్న ప్రతీసారి మీరు కొంటున్ బట్టల ఫ్యాబ్రిక్ ను ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ సరైంది అయితేనే మీరు డ్రెస్ లను ఎక్కువ రోజులు ఉపయోగిస్తారు. అలాగే మీరు దీన్ని వేసుకున్నప్పుడు కూడా అందంగా కనిపిస్తారు. అంతేకాదు మీరు వీటిని చాలా రోజుల వరకు వేసుకోగలుగుతారు. 


shopping

డ్రెస్ కుట్టడం

ధర తక్కువే అని ఏవీ చెక్ చేయకుండా తీసుకోకండి. మీరు కొనే డ్రెస్ కుట్టడం ఎలా ఉందో చెక్ చేయండి. ఎందుకంటే బట్టలు సరిగ్గా కుట్టకపోతే అవి ఒక చోట నుంచి మరో చోట కుట్లు తెగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల అవి తొందరగా చిరిగిపోతాయి. కాబట్టి డ్రెస్ ను ఎలా కుట్టారో మొత్తం చెక్ చేయండి. 

shopping

డ్రెస్ ప్రింట్

మనలో చాలా మంది డ్రెస్ ప్రింట్ చూసే కొంటుంటారు. కానీ మనం ఒక్కోసారి ఒకే రకమైన డ్రెస్ లను చాలాసార్లు కొంటుంటాం. దీంతో మనకు రకరకాల రంగుల బీన్స్ డ్రెస్ లు దొరుకుతాయి. ఇందుకోసం ఫ్యాబ్రిక్ ప్రింట్, కలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డ్రెస్ రంగు ఎక్కువగా ఉంటే ఒక్క వాష్ కే కలర్ మొత్తం పోతుంది. అది వేసుకోవడానికి పనికిరాకుండా పోతుంది. కాబట్టి రంగు పోయే వాటిని గుర్తించండి. ఇలాంటి వాటిని కొనకండి. 
 

Latest Videos

click me!